ఓటీటీలోకి టీనేజ్ లవ్ మూవీ.. అవి గుర్తు చేసే దీన్ని ఎక్కడ చూడాలంటే!
కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాకి అయినా ప్రేక్షకులు భారీ స్పందనను అందిస్తుంటారు. అలా ఎన్నో భాషల్లో చిత్రాలు వచ్చినా అవన్నీ సక్సెస్ అవుతున్నాయి. అందులో టీనేజ్ లవ్ స్టోరీలతో కొన్ని మూవీలు వస్తున్నాయి. అలాంటి ఓ సినిమానే 'సత్య'. తమిళంలో 'రంగోళి' అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందింది. దీన్ని 2023 సెప్టెంబర్‌లోనే అక్కడ విడుదల చేశారు.
'రంగోళి' అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాను వాలి మోహన్ దాస్ తెరకెక్కించాడు. టీనేజ్ లవ్ స్టోరీతో రూపొందిన ఈ మూవీలో హమరేశ్, ప్రార్థన సందీప్, మురగదాస్, సాయిశ్రీ నటించారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో బజ్ ఏర్పరచుకుంది. అలా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సొంతం చేసుకుంది.

తమిళంలో మంచి హిట్ అయిన 'రంగోళి' సినిమాను 'సత్య' పేరుతో మే 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇక్కడ కూడా ఈ సినిమాకు డీసెంట్ రెస్పాన్స్ లభించిందని చెప్పొచ్చు. ఇది థియేటర్లలో సందడి చేసి చాలా రోజులే అవుతున్నా.. ఓటీటీ స్ట్రీమింగ్ గురించి మాత్రం ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీతో ఈ సినిమా గురించి అందరూ మర్చిపోయారు.
కొత్త కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తోన్న తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఫీల్ గుడ్ మూవీలను ఒక్కొక్కటిగా స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'సత్య' సినిమాను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఈ మేరకు తాజాగా ఆహా సంస్థ ప్రకటన చేసింది. ఇందులో సెప్టెంబర్ 7వ తేదీన 'సత్య' మూవీని స్ట్రీమింగ్‌కు తెస్తున్నట్లు వెల్లడించింది.
'సత్య' మూవీ స్ట్రీమింగ్ గురించి ఆహా సంస్థ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ.. 'మన స్కూల్ లైఫ్ కనిపిస్తుంది!' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో బాల్యంలో చేసిన చిలిపి పనులను గుర్తు చేసే ఈ సినిమా కోసం చాలా మంది వేచి చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. టీనేజ్ లవ్ స్టోరీతో రూపొందిన 'సత్య' సినిమాను గోపురం స్టూడియోస్ బ్యానర్‌పై కే బాబు రెడ్డి, సతీష్ కుమార్ నిర్మించారు. దీన్ని శివ మల్లాల తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ఇందులో సంజయ్, రాహుల్, విశ్వలు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సుందరమూర్తి కేఎస్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications