OTTలోకి సైలెంటుగా వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్.. ఒక్కో సీన్‌కు ఊపిరి బిగపట్టాల్సిందే!
ఓటీటీ కంటెంటుకు సినీ ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. ప్రతి వారం కొత్త సినిమాలు, సిరీసులు ఓటీటీల్లో సందడి చేస్తునే ఉన్నాయి. తాజాగా సూపర్ హిట్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ సైలెంటుగా ఓటీటీలోకి వచ్చేసింది. అదేంటో కాదు.. యాపిల్ బ్యూటీ హన్సిక నటించిన 105 మినెట్స్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా కథేంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.
స్టార్ హీరోయిన్....:యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో ఈ బ్యూటీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

ఆదా శర్మ మిస్ చేసుకున్న సినిమా...:ఇక ఓ వైపు సినిమాలు చేస్తునే.. ఆ మధ్య తన ప్రియుడితో పెళ్లి పీటలెక్కింది. ఇక పెళ్లి తర్వాత ఈ యాపిల్ బ్యూటీ డిఫరెంట్ కాన్సెప్టులను సెలెక్ట్ చేసుకుంటుంది. అలా ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే 105 మినిట్స్. రాజు దుస్సా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఒకే ఒక్క క్యారెక్టర్ ఉంటుంది. ఇక ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను బొమ్మక్ శివ నిర్మించారు. ఇందులో 34 నిమిషాల షాట్‌ను సింగిల్ టేక్‌లో పూర్తి చేసిందని అప్పట్లో డైరెక్టర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతే కాదు ఈ సినిమాను మొదట ఆదాశర్మతో చేయాలని చూశారట మేకర్స్. అయితే ఆమెకు చర్మ సమస్యలు ఉండటం వల్ల ఈ స్క్రిప్టు హన్సిక దగ్గరు వెళ్లగా ఆమె ఓకే చేసిందట.
రెంటల్ పద్ధతిలో....:ఈ 105 మినెట్స్ మూవీ జనవరి 26న థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. రెండు నెలల తర్వాత 105 మినిట్స్ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. కాకపోతే ఈ సినిమా రెంట్ పద్ధతిలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. వంద రూపాయలు కడితేనే ఈ సినిమా చూడొచ్చన్న మాట.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే....:జాను (హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా... మార్గమధ్యంలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతుంది. భయంగా ఇంటికి చేరగానే భారీ వర్షం కారణంగా పవర్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే ఏవేవో భయంకర శబ్దాలు వినిపిస్తుంటాయి. తనను వెంటాడిన శక్తి.. ఇంట్లోకి వచ్చి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింసలు చేస్తుంది తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే అనుభవించంటూ మేల్ వాయిస్ వినిపిస్తుంది. ఆ అదృశ్య శక్తి మరణానికి, జానుకు సంబంధం ఏంటి? ఆ శక్తి నుంచి జాను ఎలా తప్పించుకుంది తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











