OTTలోకి మరో క్రేజీ హార్రర్ మూవీ.. క్షణ క్షణం వణికించే ఈ దెయ్యం సినినిమాను ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ.. ఈ పేరు వింటే చాలు ప్రస్తుతం సినీ ప్రియులు అంతా తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ముఖ్యంగా వేసవి కాలం, అందులోనూ ఎండలు బాగా కాస్తుండడంతో అంతా ఇంట్లోనే ఉంటూ ఓటీటీల్లో మతకు నచ్చిన చిత్రాలు చూస్తున్నారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలతో పాటు రొమాంటిక్ కామెడీ మూవీస్ ను కూడా తెగ ఆదరిస్తున్నారు. ఈ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతలు కూడా అలాంటి చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ వేదికగా అనేక క్రేజీ హార్రర్ చిత్రాలు ఉండగా... ఇప్పుడు మరో దెయ్యం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ హన్సిక మోత్వానీ హీరోయిన్ గా వచ్చిన రీసెంట్ హార్రర్ కామెడీ చిత్రమే గార్డియన్. తమిళ భాషలో తెరకెక్కిన ఈ సినిమాకు శబరి, గురు శరవణన్ లు దర్శకత్వం వహించారు. ఫిల్మ్ వర్క్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజయ్ చందర్ నిర్మించారు. అలాగే కేఏ శక్తివేల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. ఎం త్యాగరాజన్ ఎడిటర్ గా పని చేశారు. అలాగే సామ్ సీఎస్ సంగీతం అందించారు.

అయితే ఈ సినిమాలో హన్సికతో పాటు సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్, బేబీ కృషితాస్ యాజిన్, రాజేంద్రన్, ప్రదీప్ బెనెట్టో రేయాన్, టైగర్ తంగదురై, అభిషేక్ వినోద్, ఎంజే శ్రీరామ్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. మార్చి 8వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టులోకపోయింది. రొటీన్ కథాంశంతో వచ్చి కాస్త భయపెట్టిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. సైలెంట్ గా సింప్లీ సౌత్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాను ఇండియన్స్ మాత్రం చూసే వీలు లేదు.
ఓవర్సీస్ ఆడియన్స్ మాత్రమే చూసేలా సింప్లీ సౌత్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం త్వరలోనే తెలుగులోనూ భారతీయులు చూసే అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 10వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటన రాకపోయినా.. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం అందుబాటులోకి వస్తుందని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రం ఎప్పటి నుంటి ఓటీటీలోకి వచ్చి తెలుగు సినీ ప్రియులను అలరిస్తుందనేది.


Click it and Unblock the Notifications











