సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలో తెలుసా?
హన్సిక మెత్వానీ.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా 2007లో దేశ ముదురు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టన ఈ క్యూట్ బ్యూటీ.. మట్టండీ ఇది మట్టి అంటూ చెప్పే డైలాగ్ అయితే మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత కూడా అనేక అద్బుతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ క్యూట్ బ్యూటీ.. నాలుగేళ్ల తర్వాత ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇటీవలే విడుదల అయిన మై నేమ్ ఈజ్ శృతి సినిమా థియేటర్ల వద్ద ఫర్వాలేదనిపిచింది. అయితే ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
మై నేమ్ ఈజ్ శృతి అనే సినిమాలో హన్సిక ప్రధాన పాత్రలోన నటించింది. అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా రామచంద్రన్, మురళీ శర్మ, జయప్రకాశ్, శ్రీనివాస్ ఓంకార్, ఆడుకులం నరనే, రాజా రవీంద్ర, దయానంద్ రెడ్డిలు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించగా.. రమ్య ప్రభాకర్, నాగేంద్ర రాజులు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ముఖ్యంగా కిషోర్ బోయిడపు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా... మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు.

2023 నవంబర్ 17వ తేదీన విడుదల అయిన ఈ సినిమా థియేటర్ల వద్ద పెద్దగా ఆడలేకపోయింది. కానీ ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చి చూసిన వాళ్లను బాగానే థ్రిల్ చేసిందీ చిత్రం. అయితే బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదు అనిపించిన ఈ సినిమా.. చర్మ రవాణా గురించి సాగుతుండడం విశేషం. ఇలాంటి అధ్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో యాడ్ ఎజెన్సీలో కనిపించే అమ్మాయిగా హన్సిక కనిపించి మెప్పించింది. ముఖ్యంగా ఆమెకు ఈ చర్మ రవాణాకు గల సంబందం ఏంటి.. ఆమె ఎదుర్కున్న సమస్యలు ఏంటి, వాటి నుంచి బయట పడిందా లేదా అనేది ఈ సినిమా కథ.

రీసెంట్ గా వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. మై నేమ్ ఈజ్ శృతి సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా డిసెంబర్ 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఈ సినిమాను చూసి ఉండకపోతే.. కచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. క్షణ క్షణం ట్విస్ట్ లతో సరికొత్తగా ఉర్రూతలూగించే ఈ సినిమా చూసిన 2023కి గుడ్ బై చెప్పేయండి.


Click it and Unblock the Notifications











