OTTలో ఇప్పుడీ మూడు చిత్రాలదే హవా.. టాప్ 2లో హనుమాన్, టాప్ వన్‌లో ఏముందంటే?
ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా ఎక్కువగా పెరిగిపోయింది. ముఖ్యంగా అనేక మంది ఓటీటీల వేదికగా సినిమాలు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా అయినా, నచ్చిన సినిమాను అయినా ఓటీటీల వేదికగా పదే పదే చూస్తున్నారు. అలా చాలా క్రితం వచ్చిన చిత్రాలు కూడా ఇలా టాప్ ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. యానిమల్ సినిమా వచ్చి చాలా రోజులే అవుతున్నా ఇంకా టాప్ 3 మూవీస్ లో ఈ సినిమా ఉంది. మరి మిగతా స్థానాల్లో ఏయే చిత్రాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు టాప్ 3లో ఏయే సినిమాలు నిలిచాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్మాక్స్ మీడియా సంస్థ చేసిన ఈ సర్వేలో హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా టాప్ 1లో నిలిచింది. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్ మరియు మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించారు. అలాగే ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించి మెప్పించింది.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్, ఆమిర్ నాయక్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. జనవరి 25వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకుంది. ఆ తర్వాత అంటే మార్చి 21వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక అప్పటి నుంచి ఓటీటీలో సందడి చేస్తున్న ఈ సినిమా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

ఇక టాప్ 2లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో... తేజా సజ్జా హీరోగా చేసిన హనుమాన్ సినిమా నిలిచింది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో తేజా సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, దీపక్ రాజ్ శెట్టి, సముద్రతని, గెటప్ శ్రీనఉఖ, సత్య, భాను ప్రకాశ్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా జియో సినిమా వేదికగా మార్చి 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక అప్పటి నుంచి ఓటీటీ ప్రియులు ఈ చిత్రాన్ని తెగ చూస్తుండగా.. రెండో స్థానంలో నిలిచిపోయింది.

ఇక మూడో స్థానంలో యానిమల్ సినిమా నిలిచింది. గతేడాది డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా 2024 జనవరి 26వ తేదీన ఓటీటీలోకి వచ్చంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను టి - సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించగా.. విడుదల అయిన రోజు నుంచి ఇప్పటి వరకు టాప్ 3లో కొనసాగుతూనే వస్తుంది. మరి ఈ మూడు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను మీరు కూడా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. అస్సలే మిస్ అవ్వొద్దు సుమీ.


Click it and Unblock the Notifications











