HanuMan On OTT చరిత్ర సృష్టించిన హనుమాన్.. 11 గంటల్లోనే ఓటీటీ రికార్డులు బ్రేక్.. ఎన్ని కోట్ల వ్యూస్ అంటే?
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ, యువ హీరో తేజా సజ్జా, యువ నిర్మాత కే నిరంజన్ రెడ్డి కలిసి రూపొందించిన హనుమాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజంయ సాధించింది. చిన్న చిత్రంగా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఘనమైన వసూళ్లు సాధించి రికార్డులు తిరగరాసింది. ప్రస్తుతం ఓటీటీలో చరిత్ర సృష్టించింది. ఈ మూవీ ఓటీటీలో సృష్టిస్తున్న ప్రభంజనం వివరాల్లోకి వెళితే..
సంక్రాంతి బరిలోకి దూకిన హనుమాన్ చిత్రం రకరకాల వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుంటూరు కారం, సైంధవ్ లాంటి చిత్రాలతో పోటీ పడుతూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండోవారంలో రెండితల స్క్రీన్లను పెంచుకొని బాక్సాఫీస్‌ను దద్దరిల్లేలా చేసింది. దాదాపు 50 రోజులపాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.

హనుమాన్ చిత్రం సుమారుగా 45 కోట్ల రూపాయలతో రూపొందింది. అయితే రిలీజ్ తర్వాత తొలి ఆట నుంచే భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో సుమారుగా 300 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. దేశీయంగా, విదేశాల్లో అనే తేడా లేకుండా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జైత్రయాత్రను ముగించిన ఈ సంచలన చిత్రం తాజాగా జీ5 ఓటీటీలో రిలీజైంది.
ప్రేక్షకుల చాలా రోజుల ఎదురుచూపులు, నిరీక్షణ తర్వాత జీ5లో హనుమాన్ చిత్రం మార్చి 17వ తేదీన నుంచి స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ చిత్రం ఓటీటీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఓటీటీ చరిత్రలో అత్యధిక మంది చూసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం కొన్ని గంటల్లోనే వరల్డ్ వైడ్ టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది. ప్రేక్షకుల అంచనాలకు మించి ఓటీటీలో కొత్త అనుభూతిని పంచుతున్నది.

హనుమాన్ చిత్రం కేవలం 11 గంటల్లోనే సెంచరీ కొట్టేసింది. గతంలో ఏ సినిమా కూడా ఈ రేంజ్ వ్యూస్‌ను సాధించకపోవడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ సినిమా మార్చి 17 తేదీ అర్ధరాత్రి నుంచి 11 గంటల వ్యవధిలో 102 మిలియన్ల మినిట్స్ అంటే 10 కోట్ల నిమిషాల వ్యూయింగ్ మినిట్స్ సొంతం చేసుకొన్నది.
జీ5 ఓటీటీ విషయానికి వస్తే.. ఇండియాలో టాప్ స్ట్రీమింగ్ సంస్థగా పేరు తెచ్చుకొన్నది. ఈ ఓటీటీలో ఇప్పటి వరకు 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ పొందుపరుచుకొన్నది. దాదాపు 12 భాషల్లో అంటే హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ కంటెంట్ అందిస్తున్నది.


Click it and Unblock the Notifications











