HanuMan OTT: ముందుగానే ఓటీటీలోకి హనుమాన్.. ఎందులో చూడాలో తెలుసు కదా!
ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిన సినిమాలు చాలా తక్కువే వచ్చాయి. అలాంటి వాటిలో తెలుగు చిత్ర పరిశ్రమలో రూపొందిన 'హనుమాన్' ఒకటి. రియల్ సూపర్ హీరో ఆంజనేయ స్వామి నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా.. తేజ సజ్జా ఇందులో హీరోగా నటించిన విషయం తెలిసిందే.
సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన 'హనుమాన్' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 155 కోట్లకు పైగా వరకూ షేర్‌ను వసూలు అయింది. తద్వారా దీనికి రూ. 125 కోట్లకు పైగా లాభాలు కూడా సొంతం అయ్యాయి. ఇంకా ఇది పలు ప్రాంతాల్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'హనుమాన్' మూవీపై ఉన్న అంచనాల వల్ల దీని డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు పోటీ మంచిగానే ఏర్పడింది. దీంతో చాలా సంస్థలు ఓటీటీ హక్కుల కోసం ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే జీ5 సంస్థ 'హనుమాన్' మూవీని సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ మంచి మొత్తాన్నే నిర్మాతలకు అప్పజెప్పినట్లు వార్తలు వచ్చాయి.
థియేటర్లలో ఓ రేంజ్‌లో సందడి చేసిన 'హనుమాన్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. అదే సమయంలో ఈ చిత్రాన్ని నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయబోతున్నారని కూడా టాక్ వినిపించింది. అయితే, దీన్ని మార్చి 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తారని ఇటీవలే న్యూస్ వైరల్ అయింది.

తాజా సమాచారం ప్రకారం 'హనుమాన్' మూవీని మార్చి 1వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకు రావాలని జీ 5 సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై ఈ రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే నిజం అయితే హనుమాన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ల పంట పండినట్లే అని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











