బిగ్ షాకింగ్: మరోసారి హనుమాన్ స్ట్రీమింగ్ వాయిదా.. అసలు డేట్ ఏదంటే!
మిగిలిన జోనర్లతో పోలిస్తే డివోషనల్ కాన్సెప్టుతో వచ్చే చిత్రాలకు అన్ని భాషల్లోనూ భారీగానే స్పందన వస్తుందన్న విషయం తెలిసిందే. అలాంటి వాటికి సోషియో ఫాంటసీ ఎలిమెంట్లను జోడించి తీసిన సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఇలా టాలీవుడ్ నుంచి వచ్చి నేషనల్ వైడ్‌గా ప్రభావాన్ని చూపించిన సినిమానే 'హనుమాన్'.
రియల్ సూపర్ హీరో ఆంజనేయ స్వామి నేపథ్యంతో రూపొందిన 'హనుమాన్' సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా.. తేజ సజ్జా ఇందులో హీరోగా నటించాడు. ఆరంభంలోనే ఈ మూవీపై అంచనాలు ఏర్పడడంతో సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదలైంది. అనుకున్నట్లే ఈ చిత్రం ఘన విజయం సాధించి 125 కోట్లకు పైగా లాభాలు అందుకుంది.

సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిన 'హనుమాన్' మూవీ యాభై రోజులుగా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'హనుమాన్' చిత్రాన్ని జీ5 సంస్థ మార్చి 1వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు ఇటీవలే న్యూస్ చక్కర్లు కొట్టింది.
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గత రాత్రి నుంచే ఉంటుందని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. అలాంటి వాళ్లకు షాకిస్తూ ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు. దీంతో అసలేం అయిందని చాలా మంది డైలమాలో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో తాజాగా 'హనుమాన్' మూవీ స్ట్రీమింగ్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. 'హనుమాన్' మూవీని మార్చి 8వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకు రావాలని జీ 5 సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై ఈ రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటనను వదలబోతున్నారని అంటున్నారు. హిందీలో డిస్ట్రిబ్యూటర్లతో చేసుకున్న ఒప్పందం కారణంగానే ఈ సినిమా స్ట్రీమింగ్ మరోసారి వాయిదా పడినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కలయికలో తెరకెక్కిన 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్‌ను ఇచ్చారు.


Click it and Unblock the Notifications











