OTT లవర్స్‌కు హనుమాన్ టీమ్ బ్యాడ్ న్యూస్... స్ట్రీమింగ్ విషయంలో షాకింగ్ నిర్ణయం!
తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ చిత్రం ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల అయిన ఈ పాన్ వరల్డ్ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. విడుదల అయిన మొదటి ఆట నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ క్రమంలోనే హనుమాన్ మూవీ మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హనుమాన్ చిత్రం మొదట తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కించాలనుకున్నారు. కానీ అంతర్జాతీయ భాషల్లో సైతం విడుదలై పాన్ వరల్డ్ చిత్రంగా గుర్తింపుతెచ్చుకుంది. జనవరి 12న అంటే శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో హనుమాన్ విడుదల అయి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది.

ఇక హనుమాన్ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్, సినిమా షోస్ చూసిన ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ హనుమాన్ సినిమాను ఆకాశానికి ఎత్తుతున్నారు ప్రేక్షకులు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా... మరోవైపు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇక హనుమాన్ సినిమాకు థియేటర్లు కూడా పెరుగుతున్నాయి.

మొదట ఈ సినిమాకు థియేటర్లు ఇవ్వలేదని టాక్ నడిచింది. ఇక సినిమా రెస్పాన్స్ బాగుండటంతో.. హనుమాన్ మూవీకి థియేటర్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఉండటంతో దానికి తగినట్లుగానే ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. హనుమాన్ సినిమాను జీ5 సంస్థ మొత్తంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
హనుమాన్ తెలుగు వెర్షన్‌కు రూ. 11 కోట్లు, హిందీ వెర్షన్‌కు రూ. 5 కోట్లు వెచ్చించినట్లు ఇన్ సైడ్ టాక్. అయితే ఏ సినిమా అయినా ఓటీటీ విడుదల నెల రోజుల తర్వాత లేదంటే 40 రోజుల తర్వాత ఉంటుంది. కానీ హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక హనుమాన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విడుదల ఇప్పట్లో లేనట్లే అని తేల్చి చెప్పారు.

హనుమాన్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో తేజ మాట్లాడుతూ... హనుమాన్ ఓటీటీ విడుదల 70 రోజుల వరకు ఉండదు. కాబట్టి అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పారు. దీనితో హనుమాన్ మూవీ ఇప్పట్లో ఓటీటీలో రాదని తెలుస్తోంది. జనవరి 12న రిలీజ్ అయింది కాబట్టి... మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ నెల మొదటి వారంలో ఉండవచ్చిని అంటున్నారు. ఇక శాటిలైట్ రైట్స్ కూడా జీ5 టీవీ దక్కించుకుంది. శాటిలైట్ ప్రసారం కూడా ఇప్పుట్లో ఉండదని సమాచారం.


Click it and Unblock the Notifications











