Unstoppable 2లో హరి హర వీరమల్లు భామ.. పవన్ కల్యాణ్ తో నిధి అగర్వాల్ అలా.. బాలయ్య కొంటే ప్రశ్నలు!

నందమూరి నటసింహం హోస్ట్ గా అదరగొడుతున్న టాక్ షో అన్ స్టాపబుల్. ప్రస్తుతం ఈ టాక్ షో రెండో సీజన్ ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రారంభం అయిన ఈ రెండో సీజన్ లో ఎంతో మంది స్టార్స్ వచ్చి సందడి చేశారు.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ కు విపరీతమైన క్రేజ్ రాగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ సెన్సెషన్ గా మారనుంది. అన్ స్టాపబుల్ రెండో సీజన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ తో ముగించనుండగా.. దానిని రెండు పార్టులుగా విడదీశారు. ఇప్పటికే క్రేజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ ఎపిసోడ్ లో ఒక గ్లామరస్ బ్యూటి సందడి చేయనుంది.

 రెండు భాగాలుగా పవన్ ఎపిసోడ్..

రెండు భాగాలుగా పవన్ ఎపిసోడ్..

ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ రోజురోజుకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. గతంలో ఎప్పుడు లేనివిధంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కనిపించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ చివరి ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రానున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ను కూడా ప్రభాస్ ఎపిసోడ్ లాగే రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.

పవన్ కల్యాణ్ కటౌట్స్ తో..

పవన్ కల్యాణ్ కటౌట్స్ తో..

అయితే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ మొదటి పార్టును ముందుగా ఫిబ్రవరి 3న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఫిబ్రవరి 2న అంటే గురువారం రోజునే రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనున్నారు. ఇందుకోసం ఆహా కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే హైదరాబాదులో కొన్ని ఏరియాలలో బాలకృష్ణ పవన్ కల్యాణ్ కు సంబంధించిన కటౌట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ప్రభాస్ వచ్చినప్పుడు ప్రమోషన్స్ నిర్వహించిన కూడా ఇలాంటి ప్రమోషన్స్ మాత్రం చేయలేదని చెప్పుకోవచ్చు.

ఎలాంటి పొరపాట్లు జరగకుండా..

ఎలాంటి పొరపాట్లు జరగకుండా..

అంతేకాకుండా పవన్ కల్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లు కూడా జరగకుండా ఆహా టీమ్ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రభాస్ వచ్చినప్పుడు అందరూ ఒకేసారి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం.. సబ్ స్క్రైబ్ అవ్వడంతో ఒక్కసారిగా ఆహా సర్వర్ అంతా క్రాష్ అయిపోయి డౌన్ అయింది. ఈసారి మాత్రం అలాంటివి జరగకుండా ఉండేందుకు స్పెషల్ కేర్ తీసుకుందట ఆహా టీమ్.

ప్రత్యేకంగా సెక్యూరిటీ టీమ్..

ప్రత్యేకంగా సెక్యూరిటీ టీమ్..

ప్రభాస్ ఎపిసోడ్ సమయంలో జరిగినట్లుగా యాప్ పై ఎలాంటి ప్రభావం పడకుండా ఆహా టీం భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ సెక్యూరిటీ బృందాన్ని సైతం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎంతమంది సబ్ స్క్రైబ్ చేసుకోవడానికి రెడీ అయినా కూడా యాప్ క్రాష్ అవ్వకుండా అప్డేట్ చేసినట్లుగా పకడ్బందీగా ప్లాన్ చేశారట. అంతేకాకుండా పైరసీ ప్రభావం పడకుండా కూడా ఈసారి ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు సమాచారం.

మెరవనున్న గ్లామరస్ బ్యూటి..

మెరవనున్న గ్లామరస్ బ్యూటి..

xxఇన్ని జాగ్రత్తలతో పవన్ కల్యాణ్ ఎపిసోడ్ మొదటి పార్ట్ స్ట్రీమింగ్ కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ కు పంచకట్టుకుని సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇస్తున్నాడన్న విషయం ప్రోమో ద్వారా తెలిసిందే. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ లో ఓ గ్లామరస్ బ్యూటి మెరవనుందట. తను ఎవరో కాదు పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్.

సినిమా విశేషాలతోపాటు..

సినిమా విశేషాలతోపాటు..

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఇందులో మోస్ట్ బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అందాల నిధి పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో సందడి చేయనుంది. ఎపిసోడ్ మధ్యలో వీడియో కాల్ ద్వారా పవన్ కల్యాణ్, బాలకృష్ణలతో ముచ్చటించిందని టాక్.

అలాగే సినిమా విశేషాలతోపాటు మరికొన్ని ఆసక్తికర అంశాలను నిధి పంచుకుందట. మరి హీరోయిన్స్ గా కొంటెగా మాట్లాడే బాలయ్య బాబు నిధి అగర్వాల్ ను ఎలాంటి ప్రశ్నలు వేశాడో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X