OTT: నాని కొడుకు హీరోగా చేసిన సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో చాలా మంచి మంచి సినిమాలు కూడా నెల, రెండు నెలల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కొన్ని పెద్ద చిత్రాలు రావడంతో ఈ సినిమాలు థియేటర్ల నుంచి బయటకు రాక తప్పట్లేదు. ఇలా వచ్చి వెళ్లిన హిట్టు సినిమా ఒకటి ఉంది. ప్రస్తుతం ఆ చిత్రం సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా థియేటర్ల వద్ద ప్రేక్షకులను బాగానే అలరించింది. కానీ దురదృష్టవశాత్తు త్వరగానే బయటకు వచ్చేసింది. అయితే ఆ సినిమా ఏంటి.. ప్రస్తుతం ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఎలా చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

న్యాచురల్ స్టార్ నాని హీరోగా చేసిన సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే అందులో నాని కుమారుడిగా కనిపించిన హరీష్ కల్యాణ్ కూడా అందరికీ గుర్తుండే ఉంటాడు. చిన్నప్పటి క్యారెక్టర్ లో కాదులెండి.. పెద్దయ్యాక కనిపించే నాని కొడుకు పాత్రలో నటించి మెప్పించిన హరీష్ కల్యాణ్ హీరోగా ఇటీవలే ఓ సినిమా చేశాడు. అదే పార్కింగ్. అయితే ఈ సినిమాలో హరీష్ కల్యాణ్ సరసన ఇంధు రామచంద్రన్ హీరోయన్ గా చేసింది. భార్యభర్తలుగా అద్భుతమైన నటన కనబర్చిన వీరికి మంచి మార్కులే పడ్డాయి. వీరితో పాటు ఈ చిత్రంలో చేసిన ఇలవరుసు, ఎం.ఎస్ భాస్కర్, రమాలు కూడా ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

Harish Kalyan Parking Movie OTT Details Check Here

రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించిన పార్కింగ్ సినిమాను ప్యాషన్ స్టూడియోస్ అండ్ సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకంపై సుధన్ సుందరం, కె.ఎస్.సినీష్ నిర్మించారు. అయితే ఓ జంటకు పెళ్లి అవడం, ఆయన భార్య గర్భవతి అవ్వడంతో అతడు ఓ కారును కొంటాడు. తనకు సొంత ఇల్లు లేకపోయినప్పటికీ.. భార్య గర్భం దాల్చడంతో కారు కొంటాడు. అయితే దాన్ని పెట్టుకోవాడనికి స్థలం లేక నానా ఇబ్బందులు పడతాడు. ముఖ్యంగా ఇంటి ఓనర్ తో పార్కింగ్ విషయంలో విపరీతంగా గొడవలు పడుతుంటాడు. కేవలం మాటల వరకు మాత్రమే కాకుండా కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్ ల వరకు వెళ్లడం కూడా జరుగుతుంది.

Harish Kalyan Parking Movie OTT Details Check Here

అయితే ఈ కేసుల నుంచి వీరు ఎలా బయట పడ్డారు, పార్కింగ్ సమస్యను ఎలా అధిగమించారనేది అసలైన సినిమా కథ. అయితే అద్భుతమైన థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా నిజంగానే చాలా బాగుంది. డిసెంబర్ ఒకటవ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయిన ఈ చిత్రం నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా ఈ చిత్రం డిసెంబర్ 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు మీరు ఈ సినిమాను చూసి ఉండకపోతే ఫ్యామిలీతో కలిసి సినిమాను చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X