Don't Miss!
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ వేదిక మార్పుపై మీటింగ్.. గ్యారంటీ అంటున్న బీసీసీఐ!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- News
ఎన్టీఆర్ మృతిపై కేంద్ర,రాష్ట్రాల దర్యాప్తు-వివేకా కేసులో చంద్రబాబు,లోకేష్ నీ-కొడాలి నాని డిమాండ్
- Lifestyle
మీ వైఫ్ మిమ్మల్ని లవ్ చేస్తుందో లేదోనని డౌటా? ఇలా గుర్తించండి
- Finance
Vijaya Dairy: విజయ డైరీ నుంచి మరో 100 కొత్త ఉత్పత్తులు..
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రేయ్ జగన్.. నీకు మానవత్వం లేదురా.. హరీష్ శంకర్ కథలో షాకింగ్ డైలాగ్!
ఇటీవల కాలంలో రాజకీయాలకు అలాగే నాయకులలపై కౌంటర్ గా సినిమాల్లో డైలాగ్స్ ఎక్కువవుతున్నాయి. కాస్త పాలిటిక్స్ కు టచ్ అయినా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సినిమాలలో రాజకీయ నాయకులను టార్గెట్ చేసి కొంతమంది స్టార్ హీరోలు డైలాగ్స్ చెబుతూ ఉండడం కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. అయితే హరీష్ శంకర్ రాసిన ఒక కథకు సంబంధించిన సీన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. అందులో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కూడా ఆ డైలాగ్ చెప్పడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

పవన్ తో రీమేక్
దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నారు. తమిళంలో సక్సెస్ అయిన విజయ్ తేరి సినిమాకు రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతున్నట్లుగా కూడా కొందరు క్లారిటీ ఇచ్చారు.

ఆ కథను మార్చేసి..
అసలైతే మొదట హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను చేయాలని అనుకున్నాడు. సొంతంగా రాసుకున్న కథలో పవన్ కళ్యాణ్ ఒకవైపు పొలిటికల్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా కనిపించబోతున్నాడు అని టాక్ కూడా నడిచింది. కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ మళ్లీ ఆ కథను మార్చేసి సరికొత్త తరహాలో తేరి కథను రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమాను నిర్మించబోతోంది.

హరీష్ అందించిన కథలో..
అయితే హరీష్ శంకర్ కు సంబంధించిన ఒక వెబ్ సిరీస్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. దిల్ రాజు ప్రొడక్షన్లో హరీష్ శంకర్ కథను అందించిన ఏటీఎం వెబ్ సిరీస్ ఇటీవల జీ ఫైవ్ లో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి చేసిన కొన్ని డైలాగ్స్ కూడా రాజకీయాలకు టచ్ అయ్యేవిధంగా ఉన్నాయి అని కామెంట్స్ వస్తున్నాయి.

పాలిటిక్స్ కు దగ్గరగా..
ఒక సన్నివేశంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వెబ్ సిరీస్ లో జగన్ అనే పాత్ర కూడా బాగా హైలైట్ అయింది. అయితే అందులో మోసం జరగడంతో కోట్లు దొబ్బేసి మాకు కోటి ఇస్తావా అని 30 ఇయర్స్ పృథ్వి గ్యాంగ్ తీవ్ర స్థాయిలో వసంతృప్తితో ఉంటుంది. ఈ కథలో చెప్పిన డైలాగ్ ఇప్పుడు పొలిటికల్ గా కూడా చర్చనీయాంశమవుతోంది.
|
రేయ్ జగన్.. నీకు మానవత్వం లేదురా
రేయ్ జగన్.. నీకు మానవత్వం లేదురా.. అంటూ పృద్వి కామెంట్ చేసిన విధానం హాట్ టాపిక్ గా మారిపోయింది. అతను ఎవరిని టార్గెట్ చేసే ఆ మాట అన్నాడు అర్థమైంది అంటూ మరికొందరు ఊహించని విధంగా రియాక్ట్ అవుతున్నారు. పృద్వి కొన్నాళ్లపాటు రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక అక్కడ చేదు అనుభవాలు ఎదురు కావడంతో అక్కడినుంచి వచ్చేసి మళ్లీ సినిమాల్లో బిజీగా మారిపోయాడు.