OTT: ఓటిటిలో దుమ్ము రేపుతున్న క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే.. ఈ టాప్ 5 మూవీస్‌ను మీరు చూశారా?
క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలు స్పెషల్ గా జనాలను అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అందులో ఉండే ఉత్కంఠ భరితమైన కథనాలు, పాత్రలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. ప్రస్తుతం వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ఎన్నో వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి.
కానీ అందులోకి వెళ్లి సెలెక్ట్ చేసుకోవడం అనేది పెద్ద పనే అని చెప్పాలి. అలాంటి వాళ్ల కోసమే డైరెక్ట్ గా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి ప్రస్తుతం ఓటీటీతో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 5 సౌత్ ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ పై ఓ లుక్కేద్దాం.

1. విక్రమ్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్. ఈ మూవీలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషించారు. పేరు మోసిన డ్రగ్ లార్డ్ సామ్రాజ్యాన్ని కూల్చి వేయడానికి విక్రమ్ సీక్రెట్ ఆపరేషన్ చేయడమే ఈ మూవీ స్టోరీ. ఊహించని ప్లాట్, ట్విస్ట్ లతో నిండి ఉన్న ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.

2. యశోద
సమంత నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన తెలుగు క్రైమ్ డ్రామా యశోద. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ తెలుగు మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

3. దృశ్యం 2
మలయాళ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ దృశ్యం మూవీకి సీక్వెల్ గా వచ్చిందే దృశ్యం 2. మోహన్ లాల్ ఈ సినిమాలో హీరోగా నటించగా, జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మొదటి పార్ట్ లో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓ వ్యక్తి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది అనే విషయాలను చూపించారు. అయితే రెండో పార్ట్ కూడా గ్రిప్పింగ్ కథాంశంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

4. కాంతారా
కన్నడ సినీ రంగాన్ని తలెత్తుకునేలా చేసిన మూవీ కాంతారా. ఇంట్రెస్టింగ్ కథనంతో సాగే ఈ మూవీలో రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

5. కేజిఎఫ్ -2
ఇక కన్నడ పరిశ్రమలో చెప్పుకోదగ్గ మరో ఆణిముత్యం లాంటి మూవీ కేజిఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో యష్ హీరోగా నటించారు. ఫస్ట్ పార్ట్ తో పాటు సెకండ్ పార్ట్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ప్రత్యేకంగా నిలిచాయి.
యష్ తో పాటు ప్రశాంత్ నీల్ ను కూడా ఈ మూవీనే పాన్ ఇండియా స్టార్స్ గా నిలబెట్టింది అంటే అందులో ఎంత ప్రత్యేకత ఉందో చెప్పక్కర్లేదు. హై ఆక్టెన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు గ్రిప్పింగ్ స్టోరీ, సస్పెన్స్ కూడా కావలసినంత ఉంటాయి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











