చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో చాలా వరకు కొన్ని సినిమాలు థియేటర్లకు వచ్చి వెళ్లిన విషయం కూడా ఎవరికీ తెలియట్లేదు. థియేటర్లలోకి వచ్చిన విషయం ఏమాత్రం తెలియకపోయినా ఓటీటీలోకి వస్తే మాత్రం అందరికీ తెలిసిపోతుంది. అలా చాలా చిత్రాలు ఓటీటీలోనే చూసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద చిత్రాలు మాత్రమే కాకుండా చాలా చిన్న చిన్న సినిమాలను కూడా ఓటీటీ వేధికగా చూస్తూ... మంచి కథలను మస్తుగా ఆదరిస్తున్నారు. అయితే తాజాగా ఓ అద్భుతమైన సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో వచ్చిన పాయల్ రాధాకృష్ణ, దినేష్ తేజ్, మహేష్ ఆచంట, శివకుమార్ రామచంద్రవలు ఈ చిత్రంలో నటించి మెప్పించారు. ముఖ్యంగా ఈ సినిమా నవంబర్ 10వ తేదీన విడుదల అయిన ఈ సినిమా వచ్చి వెళ్లిన విషయం కూడా తెలియదు. అందుకు కారణాలు కూడా చాలనే ఉన్నాయి. ముఖ్యంగా అదే సమయంలో పెద్ద సినిమాలు విడుదల అవడం ముఖ్యంగా అప్పుడే వరల్డ్ కప్ హంగామా ఉండడంతో ఈ సినిమాను పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఇలా ఈ చిత్రం వచ్చి పోయింది కూడా ఎవరికీ తెలియలేదు.

అతి తక్కువ మంది మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. కానీ చాలా మంది ఈ అద్భుతమైన చిత్రాన్ని మిస్ చేసుకున్నారు. కానీ ఈ సినిమా సూపర్ లవ్ స్టోరీ కావడం.. యువతకు బాగా నచ్చుతుందని.. చాలా మంది రీవ్యూయర్లు రీవ్యూలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కథ ఏంటంటే... దివ్య(పాయల్ రాదాకృష్ణ)కి ఈమె తల్లి పెళ్లి ఫిక్స్ చేసింది. కానీ ఆమె మాత్రం మరో అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇలా గణేష్ తో ప్రేమలో పడగా... ఇద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు.

కానీ ఈ ప్రేమికుల ఇద్దరి మధ్యలోకి హెబ్బా పటేల్ వస్తుంది. ఆమె ఎందుకు వస్తుంది, ఆమె వచ్చి ఏం చేస్తుంది.. ప్రేమికులు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ముఖ్యంగా థియేటర్లలో ఈ చిత్రాన్ని మస్ అయిన వాళ్ల కోసం ఓటీటీ వేధికగా ఈ సినిమాను స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ నుంచి విడుదల అవుతోంది. మీరూ ఓసారి ఈ సినిమాను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











