150 మిలియన్స్ వ్యూస్‌తో వ్యవస్థ రికార్డు.. హెబ్బా పటేల్, కామ్నా జఠ్మలానీ ఎమోషనల్

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 విభిన్నమైన చిత్రాలతో, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నది. జీ5 ఓటీటీలో తాజాగా విడుదలైన వెబ్ సిరీస్ వ్యవస్థ రికార్డు స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకొన్నది. కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కామ్నా జఠ్మలానీ నటించారు. మర్డర్ మిస్టరీగా రూపొందిన ఈ కోర్టు రూమ్ డ్రామా విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది.

ఆనంద్ రంగ దర్శకత్వం వహించి, పట్టాభి చిలుకూరితో కలిసి ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఇప్ప‌టికే 150 మిలియ‌న్ వ్యూయింగ్ మినిట్స్‌ను నమోదు చేసింది. ఈ సందర్భంగా వ్యవస్థ టీమ్ నిర్వహించిన సక్సెస్ మీట్‌కు హీరో సందీప్ కిషన్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.

Hebba Patels Vyavastha web Series gets 150 million Views on ZEE5

నటుడు సంప‌త్ రాజ్ మాట్లాడుతూ .. నాపై నమ్మకం పెట్టుకొని నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఆనంద్ రంగాకు థాంక్స్‌. వెంక‌ట్‌, పట్టాభి స‌హా డైరెక్ష‌న్ టీమ్‌కి ధ‌న్య‌వాదాలు. వ్య‌వ‌స్థ చేసే ముందు చాలా మంది ఎందుకు చేస్తున్నావ‌ని అడిగారు.

అయితే నాకు స్క్రిప్ట్‌పై నమ్మ‌కం ఉంద‌ని చెప్పాను. ఇదొక స్లో బ‌ర్న‌ర్‌లా ఆడియెన్స్‌కి క‌నెక్ట్ అయ్యింది. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ ఆద‌రిస్తార‌ని మ‌రోసారి వ్య‌వ‌స్థ ప్రూవ్ చేసింది. జీ 5 మార్కెటింగ్ స్ట్రాట‌జీతో దీన్ని సూప‌ర్ సక్సెస్ చేశారు అని అన్నారు.

హీరో సందీప్ కిష‌న్ మాట్లాడుతూ .. వ్యవస్థ వెబ్ సిరీస్‌లో నటించిన వారందరరూ చాలా కావాల్సిన వారే. సంపత్‌ రాజ్‌తో క‌లిసి సినిమా చేయాల‌ని ఎదురు చూస్తున్నా. అలాగే నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా పనిచేసినప్పటి నుంచి కామ్నా జెఠ్మ‌లానీతో ప‌రిచ‌యం ఉంది.

హెబ్బా ప‌టేల్‌కి కంగ్రాట్స్. కార్తీక్ ర‌త్నం అంటే చాలా ఇష్టం. త‌ను వ్య‌వ‌స్థ‌లో పోషించిన తీరు అద్భుతం. జీ5కి అభినంద‌న‌లు. వ్య‌వ‌స్థ సినిమాను ఎలా తెర‌కెక్కించారా అని వెయిట్ చేసి చూశాను. ఎంటైర్ టీమ్‌కి కంగ్రాట్స్‌. 150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌ అని అన్నారు

హీరోయిన్ హెబ్బా ప‌టేల్, కామ్నా జఠ్మలానీ మాట్లాడుతూ.. వ్యవస్థ సిరీస్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వ‌స్తోంది. అంత మంచి స‌క్సెస్ అందించిన ప్రేక్ష‌కుల‌కు, ఆనంద రంగ గారికి, స‌పోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు ధ‌న్య‌వాదాలు అని హెబ్బా పటేల్ అన్నారు.

కామ్నా జెఠ్మలానీ మాట్లాడుతూ... ఎగ్జ‌యిటెడ్‌గా, నెర్వ‌స్‌గా ఉన్నాను. ఎందుకంటే ఆరేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాను. చిన్న రోల్ అయినా చాలా ఇంపార్టెంట్ ఉండ‌టంతో యాక్సెప్ట్ చేశాను. సంప‌త్‌కు, కార్తీక్ ర‌త్నం, హెబ్బా ప‌టేల్ అంద‌రికీ థాంక్స్‌ అని అన్నారు.

కార్తీక్ రత్నం మాట్లాడుతూ ''సందీప్ కిషనన్న‌ను క‌లిసి త‌ర్వాత ఆయ‌న నాకు ఎప్పుడూ తిరుగులేని స‌పోర్ట్‌ను అందిస్తూనే ఉన్నారు. ఆనంద్ రంగ‌గారితో క‌లిసి ప‌ని చేయ‌టం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. ప‌ట్టాభిగారు చాలా ధైర్యం చేసి తీశారు. సంప‌త్ రాజ్‌, అనిల్ సార్ అంద‌రికీ థాంక్స్‌. హెబ్బా ప‌టేల్‌, కామ్నా జెఠ్మ‌లానీతో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం చాలా ఆనందంగా ఉంది. ఎంటైర్ టీమ్‌కి థాంక్స్‌. జీ 5వారు చేస్తోన్న స‌పోర్ట్ మ‌ర‌చిపోలేం. చ‌క్క‌గా ప్ర‌మోట్ చేస్తున్నారు. ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు'' అన్నారు.

న‌టీన‌టులు: వంశీగా కార్తీక్ ర‌త్నం, చ‌క్ర‌వ‌ర్తిగా సంప‌త్ రాజ్‌, యామినిగా హెబ్బా ప‌టేల్‌, గాయ‌త్రి పాత్ర‌లో కామ్నా జెఠ్మ‌లానీ త‌దిత‌రులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఆనంద్ రంగ‌
నిర్మాత‌లు: ప‌ట్టాభి చిలుకూరి, ఆనంద్ రంగ‌
సినిమాటోగ్ర‌ఫి: అనిల్ భండారి
పీఆర్వో: బియాండ్ మీడియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X