Indian Top 10 Web Series: ఓటీటీలో దుమ్మురేపుతున్న 10 వెబ్ సిరీస్‌లు.. మీరు వాటిని చూశారా?
ఎంటర్టైన్మెంట్ రంగంలో మన ఇండియన్ ఆడియన్స్ కూడా ఫిల్మ్ మేకర్స్ పెద్ద పీటనే వేస్తారు. ఏ దేశపు కంటెంట్ అయినా కూడా అది థియేటర్స్ లో అయినా లేదా ఓటిటిలో అయినా సరే మన వాళ్ళు ఇచ్చే రిపీట్ వాల్యూ మరెక్కడా ఉండదు అని చెప్పడంలో డౌట్ లేదు. అందుకే హాలీవుడ్ సినిమాలు సైతం ఇతర దేశాల కంటే మన దగ్గర ఎక్కువ దృష్టి పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. కాగా ఇపుడు కాలం మారడంతో ఓటిటి రంగం కూడా బాగా వృద్ధి చెందింది.
ఇలా మన దేశంలో థియేటర్స్ తో పాటుగా ఓటిటి కంటెంట్ కూడా చూసే వాళ్ళు ఎక్కువ అయ్యారు. దీనితో పాటుగా మన దేశం నుంచి మన వాళ్ళే పలు ఓటిటి సంస్థలకి సాలిడ్ వెబ్ సిరీస్ లను సినిమాల్ని కూడా మన వాళ్ళు గట్టిగానే ఆదరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పలు ప్రముఖ స్ట్రీమింగ్ యాప్స్ లో అయితే ఇండియా వైడ్ గా జనం ఏ వెబ్ సిరీస్ లని ఎక్కువ చూస్తున్నారో ఇప్పుడు తెలుస్తుంది. తాజాగా ఓరామాక్స్ ఇండియా చేసిన సర్వేలో టాప్ 10 వెబ్ సిరీస్ వివరాల్లోకి వెళితే..

కాగా ఇండియా వైడ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ ఇంకా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లలో అయితే పలు ఓటిటి సిరీస్ లకి ఆడియెన్స్ సాలిడ్ రెస్పాన్స్ ని అందిస్తున్నారు. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన వైలెన్స్ వెబ్ సిరీస్ "మిర్జాపూర్ సీజన్ 3" అయితే ఇప్పుడు ఇండియా వైడ్ గా అత్యధికంగా చూస్తున్న సిరీస్ గా నిలిచిందట. ఇక దీని తర్వాత మళ్ళీ ప్రైమ్ వీడియో లోనే కామెడీ ఎంటర్టైనర్ సిరీస్ "పంచాయత్ సీజన్ 3" ని ఎక్కువ చూస్తున్నారట.
మరి దీని తర్వాత టాప్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో "కోటా ఫ్యాక్టరీ సీజన్ 3" కి ఎక్కువ రెస్పాన్స్ రాగా మరి దీని తర్వాత నాల్గవ స్థానంలో మళ్ళీ ప్రైమ్ వీడియోలో అమెరికన్ సూపర్ హీరో వెబ్ సిరీస్ "ది బాయ్స్ సీజన్ 4" ని చూస్తున్నారు. ఇక్కడే మన వాళ్ళు హాలీవుడ్ కంటెంట్ ని కూడా ఏ లెవెల్లో చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. కాగా దీని తర్వాత జియో సినిమాలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహా టాక్ ని తెచ్చుకున్న క్రేజీ హాలీవుడ్ సిరీస్ "హౌస్ ఆఫ్ డ్రాగన్" కి ఎక్కువ వ్యూవర్ షిప్స్ వస్తున్నాయట.

రీసెంట్ గా ఈ సిరీస్ కి కూడా మంచి రెస్పాన్స్ పెరగడం మొదలైంది. ఇంకా ఆరవ స్థానంలో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న "గుల్లక్" సీజన్ 4 ట్రెండింగ్ అవుతుంది. ఇక దీని తర్వాత వరుసగా మూడు స్థానాల్లో హాట్ స్టార్ లోని వెబ్ సిరీస్ లు నిలిచాయి. "బ్యాడ్ కాప్", "కమాండర్ కరణ్" అలాగే యానిమేటెడ్ సిరీస్ "ది లెజెండ్ ఆఫ్ హనుమాన్" లు ఎక్కువ రెస్పాన్స్ తో ట్రెండ్ అవుతున్నాయి.
ఇక ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ నుంచి బాలీవుడ్ టాప్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి తదితర లేడీ క్యాస్టింగ్ తో చేసిన "హీరామండీ" నిలిచింది. ఇలా ప్రస్తుతం ఇండియా వైడ్ గా అయితే ఓటిటిలో ప్రేక్షకులు ఈ సిరీస్ లని అత్యధికంగా చూస్తున్నారు. మరి వీటిలో మీరు వేటినైనా మిస్ అయ్యారా?


Click it and Unblock the Notifications











