Marco OTT release: ఉన్ని ముకుందన్ 100 కోట్ల సంచలనం ..ఓటీటీలోకి మార్కో , ఎప్పుడంటే?

గతేడాది భారీ నష్టాలను ఎదుర్కొని విమర్శలను ఎదుర్కొన్న మలయాళ చిత్ర పరిశ్రమకు తిరిగి ఊపిరి పోశారు యువనటుడు ఉన్ని ముకుందన్. ఆయన నటించిన మార్కో చిత్రం గతేడాది డిసెంబర్‌లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఉన్ని ముకుందన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి విమర్శలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

హనీఫ్ అదేని దర్శకత్వంలో తెరకెక్కిన మార్కోలో సిద్ధిఖ్, జగదీష్, అభిమన్యు తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సోన్ పౌల్‌లు కీలక పాత్రలు పోషించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై షరీఫ్ మొహమ్మద్ దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌‌తో తెరకెక్కించగా రవి బస్రూర్ స్వరాలు సమకూర్చారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఏకంగా రూ. 115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో లాభాల పంట పండించింది.

here is an update about unni mukundan starrer blockbuster movie marco ott release date

తొలి రోజు 4.5 కోట్లతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.. తొలి వారం ముగిసే సమయానికి ఈ చిత్రం 28 కోట్లకుపైగా నికర కలెక్షన్లు, 40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో వారంలో ఈ సినిమా 40 కోట్ల నికరంగా, 60 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. మలయాళంతోపాటు హిందీలో రిలీజైన ఈ సినిమా తొలివారం అంతంత మాత్రంగానే కలెక్షన్లు సాధించింది. ఫస్ట్ వీక్‌లో కేవలం 28 లక్షల నికర వసూళ్లను రాబట్టినప్పటికీ సెకండ్ వీకెండ్‌లో ఉన్నిముకుందన్ ప్రభంజనం చూపించాడు.

రెండో వారంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2కి ధీటుగా హిందీలో వసూళ్లను నమోదు చేసింది. ఆ తర్వాత ప్రతీ రోజు కలెక్షన్లు పెరుగుతూ ఉండటంతో ట్రేడ్ వర్గాల్లో ఉత్సాహం కనిపించింది.
ఇక తెలుగులో జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే భారీ వసూళ్లను సాధించింది. రూ.1.25 కోట్ల నికర కలెక్షన్లు, 3 కోట్ల గ్రాస్ వసూళ్లను ఆంధ్రా, తెలంగాణలలో సాధించింది.

ఈ నేపథ్యంలో మార్కోను ఓటీటీలో చూసేందుకు ఆ కేటగిరీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఓటీటీ నిబంధనల ప్రకారం థియేటర్లలో రిలీజైన 57 రోజులకు ఆయా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలైతే నెల రోజుల లోపే ఓటీటీలోకి వస్తున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి మార్కో ఓటీటీ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలయాళ, తెలుగు, తమిళ , హిందీ భాషల్లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాను మరిన్ని భారతీయ భాషల్లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.

దీనిలో భాగంగా జనవరి 31 నుంచి కన్నడలో మార్కోను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కో ఓటీటీపై ఇంకా చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మార్కో డిజిటల్ రైట్స్ కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్‌పై త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని మాలీవుడ్ టాక్.

More from Filmibeat

Read more about: unni mukundan marco ott news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X