ఎట్టకేలకు OTTలోకి 5 నెలల తర్వాత తెలుగు స్పై థ్రిల్లర్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మినిమం ఏ సినిమా అయినా నెలరోజుల్లో వస్తుంది. అయితే ఓ సినిమా 5నెలలు దాటినా తర్వాత ఓటీటీలోకి వస్తోంది. అదేదో హిట్ సినిమా అనుకుంటే పొరపాటే. అఖిల్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఏజెంట్. ఈ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. ఎప్పుడెప్పుడూ వస్తుందా అని ఎదురు చూసిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అఖిల్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఏజెంట్. ఇక ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 23న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఇందులో మమ్మూట్టి లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ ఆశించిన విజయం దక్కలేదు.

అఖిల్ అక్కినేని సరసన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయింది. ఇక ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకుంది.
అఖిల్ కు మొదటి చిత్రం నుంచే ఫ్లాపులు వస్తున్నాయి. ఆ తర్వాత అఖిల్ నటించిన హలో, మిస్టర్ మజ్నూ లాంటి చిత్రాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు అఖిల్ అని అంతా అనుకున్నారు.
ఇక భారీ ఆశలతో అఖిల్ పాన్ ఇండియా చిత్రం ఏజెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ పరాజయం చెందింది. అయితే దీనికోసం అఖిల్ రెండేళ్లు కష్టపడి బాడీని పెంచాడు. సినిమా మొదలుపెట్టినప్పటినుంచి ఎన్నో వాయిదాల తరువాత ఏప్రిల్ 28న ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
దాదాపు 5నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఓటిటీ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఏజెంట్ డిజిటల్ హక్కులను సోనీలివ్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 29 నుంచి సోనీలివ్ లో ఏజెంట్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











