The Village OTT: ఓటీటీలోకి గుండెల్లో వణుకు పుట్టించే వెబ్ సిరీస్.. ఫుల్లుగా డేర్ ఉన్నవాళ్లే చూడాలి గురూ!
Arya First Web Series: వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ... దేశవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ను సంపాధించుకున్నాడు హీరో ఆర్య. ఈయన చేసిన చాలా తమళి సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. వాటిని తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఆయనను గుండెల్లో పెట్టుకుని మరీ చిత్రాలను హిట్ చేశారు. ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాల్లో కనిపించి అందరినీ నవ్వించి, ఏడిపించిన ఈయన... తాజాగా ఓ కొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈయన చేసిన తొలి ఓటీటీ వెబ్ సిరీస్ కూడా ఇదే కావడం గమనార్హం. ముఖ్యంగా ది విలేజ్ పేరుతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో ఆర్య లుక్ అదిరిపోయింది.
షమిక్ దాస్ గుప్త రచించిన గ్రాఫిక్ నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను మిళింద్ రావు తెరకెక్కించారు. కేవలం ఆర్యకు మాత్రమే ఇది తొలి వెబ్ సిరీస్ కాదు.. గ్రాఫిక్ నవల ఆధారంగా రూపొందించబడిన మొట్ట మొదటి భారతీయ వెబ్ సిరీస్ గా కూడా ది విలేజ్ గుర్తింపు సాధించింది. ది విలేజ్ వెబ్ సిరీస్ ను ప్రకటించినప్పటి నుంచి సినీ ప్రేక్షకులు అంతా ఫుల్ ఎగ్జైటింగ్ గా దీనికోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అందులో ఆర్య లుక్ నిజంగానే అదిరిపోయింది.

ది విలేజ్ వెబ్ సిరీస్ లో ఆర్య సరసన దివ్య పిళ్లై నటిస్తోంది. అలాగే ఆజియా, ఆడుకులం నరేన్, తలైవాసల్ విజయ్, ముత్తుకుమార్, కలై రాణి, జార్జ్ ఎం, జాన్ కొక్కెన్, అర్జున్ చిదంబరం, పూజ, జయ ప్రకాష్, పి.ఎన్ సన్నీ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. గౌరవ్ శ్రీవాస్తవ్, ప్రసాద్ పట్నాయక్ లు ఈ సిరీస్ ను తెరకెక్కించారు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ ను మేకర్స్ తెలిపారు. ఎప్పుడు, ఏ ఓటీటీ వేదికగా విడుదల చేయబోతున్నారో ప్రకటించారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నవంబర్ 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ వెబ్ సిరీస్ వీడియోలు చూస్తుంటేనే దీనిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మనిషి చేతులోత చెట్టు రూపంలో ఉన్న ఓ మనిషి తల కనిపించడం అందులోనూ అది అరవడం నిజంగా భయంకరంగా ఉంది. ఈ వీడియోకు నీడలో దాగి ఉన్న రహస్యాలను వెలికి తీయండి అని చెప్పే క్యాప్షన్ కూడా పెట్టారు మేకర్స్.
అలాగే మరో వీడియోలో సాయుధ దళాలపై వింత మనుషులు దాడి చేయడం చూస్తుంటే ఓళ్లంతా గగుర్పాటుకు గురవుతోంది. అయితే వింత ఆకారంలో ఉన్న మనుషులను హీరో ఆర్య చంపే ప్రయత్నం చేయడం కూడా మనం ఆ వీడియోలో చూడవచ్చు. నిజంగా ఈ వెబ్ సిరీస్ చాలా భయంకరంగా కనిపిస్తోంది. ఎక్కువ డేర్ ఉన్న వాళ్లు మాత్రమే ఈ వెబ్ సిరీస్ చూస్తే మంచిది.


Click it and Unblock the Notifications











