OTTలోకి రాబోతున్న జై న్యూ వెబ్ సిరీస్ "లేబుల్" .. ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీ.. ఈ పేరు వింటేనే చాలా మంది తెగ ఎగ్టైట్ అయిపోతుంటారు. కొత్త కొత్త సినిమాలతో పాటు అదిరిపోయే వెబ్ సిరీస్ లను ఎప్పుడు పడితే, ఎక్కడ పడితో అక్కడ చూసే వెసులు బాటు కల్పించిన ఓటీటీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎంత పెద్ద స్టార్ హీరోల చిత్రాలు అయినా సరే థియేటర్లలో చూడడం వీలు కాని వారంతా ఓటీటీల వేదికగా తమ కుటుంబ సభ్యులతో కలిసి మరీ సినిమాలు చూస్తున్నారు. తమకు నచ్చిన వెబ్ సిరీస్ లను కూడా రోజూ చూస్తూ చిల్ అవుతున్నారు. అలాంటి వారికోసమే ఈ వార్త. ఓ అదిరిపోయే వెబ్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఈ కథనంలో చూద్దాం పదండి.
తమిళ హీరో జై గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనేక తెలుగు చిత్రాల్లో ముఖ్యంగా తమిళ్ లో తీసి తెలుగులోకి డబ్ అయిన చిత్రాల్లో మనకు ఈ హీరో కనిపిస్తాడు. అయితే ఈయన హీరోగా తాజాగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. దాని పేరే లేబుల్. అరుణ్ రాజా కామరాజ్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ లో తాన్య హోప్ కథానాయికగా నటించింది. అలాగే ఇళవరసు, మహేంద్రన్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

నిన్ననే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మేము ఎవరన్నది ఎవరెవరో డిసైడ్ చేస్తున్నారు.. కానీ మేము ఎవరన్నది మేము చెప్పాలంటూ జై చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆయన ఓ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ ను ఎప్పటి నుంచి ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు మేకర్స్ ప్రకటించారు.
ప్రముఖ ఓటీటీ సంస్ధ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమిగ్ అవనున్నట్లు ప్రకటించారు. నవంబర్ 10వ తేదీ నుచి తమిళ, తెలుగు, భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతున్నట్లు స్పష్టం చేశారు. లీగల్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్ కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ముఖ్యంగా జడ్డి అవ్వాలనుకున్న ఓ యువకుడి కలను కొందరు వ్యక్తులు ఎందుకు అడ్డుకున్నారో తెలియాలంటే కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











