Vyavstha Web Series హెబ్బా పటేల్‌పై కార్తీక్ రత్నం సెటైర్.. ఇంటర్ చదివేటప్పుడు అంటూ చిలిపి కామెంట్!
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 మంచి అనుభూతిని కలిగించే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోస్‌తో ఆకట్టుకుంటోన్నది. జీ 5 ఓటీటీలో ఏప్రిల్ 28 తేదీన నుంచి వ్యవస్థ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కోర్టు రూమ్ డ్రామా తెరకెక్కిన సిరీస్‌ను ఓయ్ మూవీ ఫేమ్ ఆనంద్ రంగ రూపొందించారు. గతంలో జీ 5లో షూట్ ఔట్ ఎట్ అలేర్ సిరీస్‌ను ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఈ వెబ్ సిరీస్‌లో కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. గురువారం సిరీస్ లాంచ్ డే ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు, జీ 5 ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
క్రాష్ కోర్స్ చేసిన ఫీలింగ్: కార్తీక్ రత్నం మాట్లాడుతూ.. నాకు అవకాశం అందించిన దర్శకుడు ఆనంద్ రంగా థాంక్స్. ఆయన సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్‌ని. పట్టాభి గారికి థాంక్స్. జీ టీమ్‌కు థాంక్స్. చాలా డిఫరెంట్ కంటెంట్ కోర్టు డ్రామా. తప్పకుండా ఆడియెన్స్‌కి నచ్చుతుంది. సంపత్‌గారితో కలిసి నటించటం చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో నటించడం ద్వారా ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో క్రాష్ కోర్స్ చేసిన ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది అని అన్నారు.

హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి: హీరోయిన్ హెబ్బాగారు నటనలో సీనియర్ యాక్టర్. నేను ఇంటర్ చదివేటప్పుడు ఆమె ఫస్ట్ సినిమా వచ్చింది. అయినప్పటికీ ఆమె ఎంతో సపోర్ట్ చేస్తూ నటించారు.క్యాస్టూమర్ మంచి డ్రసెస్ అందించారు. నాకు కోసం ఎక్కువగా కష్టపడలేదు. ఎందుకంటే నేను వైట్ అండ్ వైట్ డ్రస్‌లోనే కనిపిస్తాను. మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు అని కార్తీక్ రత్నం అన్నారు.

జీ5లో స్ట్రీమింగ్: వ్యవస్థ సినిమాటోగ్రాఫర్, నిర్మాత వెంకట కృష్ణగారికి థాంక్స్.ఈ వెబ్ సిరీస్ షూట్‌లో మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఏప్రిల్ 28 రాత్రి నుంచి వ్యవస్థ వెబ్ సిరీస్‌లో జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ మీకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. ఈ సిరీస్‌ను చూసి ఎంజాయ్ చేయండి అని కార్తీక్ రత్నం అన్నారు.

సూపర్బ్ టీమ్‌తో కలిసి: హెబ్బా పటేల్ మాట్లాడుతూ... ఓటీటీలో మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించాలని అనుకుంటున్న సమయంలో వ్యవస్థ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చింది. వ్యవస్థ వెబ్ సిరీస్‌లో యామిని పాత్రను ఇచ్చిన దర్శకుడు ఆనంద్ రంగాకు థాంక్స్. ఈ వెబ్ సిరీస్ కోసం సూపర్బ్ టీమ్‌తో కలిసి పని చేశాను. కచ్చితంగా ఆడియెన్స్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఫీల్ అవుతారు అని అన్నారు.


Click it and Unblock the Notifications











