OTTలోకి రాబోతున్న శ్రీకాంత్ రీసెంట్ సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అనేక అద్బుతమైన, సూపర్ డూపర్ హిట్టు చిత్రాలన్నీ త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్ల వద్ద ఎంత సందడి చేసినా ఓటీటీల్లో మరోసారి రచ్చ చేస్తూ విపరీతమైమ టీఆర్పీని సొంతం చేసుకుంటున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఫుల్ ట్రెండింగ్ లో నిలిచిన లింగి లింగి లింగిడి.. పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమా కంటే ఎక్కువగా ఈ పాట ట్రెండ్ అయింది. పాటే కాదు... సినిమా కూడా థియేటర్ల వద్ద అంతే స్థాయిలో రచ్చ చేసింది. అయితే బాక్సాఫీసు వద్ద బారాగానే వసూళ్లు రాబట్టుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేక శ్రీకాంత్ హీరోగా వచ్చిన తాజా పొలిటికల్ యాక్షన్ చిత్రమే కోటబొమ్మాళి పీఎస్. ఈ సినిమాకు తేజ మార్ని దర్శకత్వం వహించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, మురళీ శర్మ, దయానంద్ రెడ్డిలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే ఇది తెలుగు భాషా చిత్రం కాగా.. 2021లో వచ్చిన మలయాళ సినిమా నయట్టుకి రీమేక్. నవంబర్ 24వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లను రాబట్టుకుంది.

Hero Meka Srikanth Kotabommali PS OTT Streaming Details Check Here

ముఖ్యంగా ఈ సినిమాలో నటించి శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ లకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి. ఎలాంటి అంచనాలు లేకుండా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రానికి లింగి లింగి లింగిడి పాట చాలా ప్లస్ అయిందనే చెప్పొచ్చు. ఆ పాట వల్లే ఈ సినిమాకు విపరీతమైన గుర్తింపు లభించింది. పెద్దగా ప్రమోషన్లు కూడా చేసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక్క పాటతో ట్రెండింగ్ లో నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

Hero Meka Srikanth Kotabommali PS OTT Streaming Details Check Here

తాజాగా ఈ సినిమా ఓటీటీ విడదల తేదీ గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహాలో స్ట్రీమింగా కోబుతున్నట్లు నేరుగా ఆహానే వివరించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11వ తేదీ నుంచి ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని మీరు చూసి ఉండకబోతే ఫ్యామిలీతో కలిసి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమానే కాకుండా మరిన్ని చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. వాటిపై కూడా ఓ కన్నేసి హాలీ డేస్ ను బాగా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X