Rangabali on OTT నెల కాకముందే ఓటీటీలోకి రంగబలి.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం రంగబలి. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక జులై 7న రంగబలి మూవీ థియేటర్లోకి వచ్చింది. అయితే విడుదలై నెల రోజులు కాక ముందే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే....
ఆఫర్లు క్యూ...: అమ్మాయిల రాకుమారుడు నాగశౌర్య... ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఇక ఆ సినిమాలో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో నాగశౌర్య ప్రేక్షకులను... ముఖ్యంగా అమ్మాయిలను అలరించాడు. రాశి ఖన్నా, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. అంతే కాదు ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇక ఆ సినిమా తర్వాత ఈ హీరోకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.

సాలిడ్ హిట్ పడితే...: సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ.. నాగశౌర్యకు సాలిడ్ హిట్ పడటం లేదు. ఆ కటౌట్ కు సాలిడ్ హిట్ పడితే.. పాన్ ఇండియా స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఫలితం ఆశించకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ యంగ్ హీరో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ.. సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు నాగశౌర్య.

అనూష శెట్టితో...: బెంగళూరుకు చెందిన అనూష శెట్టితో ఈ మధ్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత రంగబలి అనే చిత్రాన్ని చేశాడు. ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్న ఈ హీరోకి.. చివరకు చుక్కెదురైంది. రంగబలి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టీజర్స్, ట్రైలర్స్ బాగానే ఉన్నా.. సినిమా విషయానికి వచ్చే సరికి ఫలితం ఆశించిన స్థాయిలో రాలేదు.
నెలకాకముందే..: నాగ శౌర్య నటించిన ఈ రంగబలి మూవీ జూలై 7న థియేటర్లోకి వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ వర్కౌట్ అయినా... కథలో బలం లేకపోవడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందువల్లే థియేటర్లో విడుదలై నెల రోజులు కాకముందే రంగబలి మూవీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ శుక్రవారం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేశారు. ఆగస్ట్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే... పవన్ బసంశెట్టి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అంశాలతో పవన్ బాసంశెట్టి ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











