OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. అస్సలు మిస్ అవ్వొద్దు!

ఓటీటీలోకి న్యూ ఇయర్ కానుకగా మరో కొత్త సినిమా వచ్చేసింది. నాని నటించిన సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ హాయ్ నాన్న ఓటీటీకిలోకి వచ్చి సందడి చేస్తుంది. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ లభించింది. ఇక యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమా పోటీని దాటుకుని మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పక్కింటి కుర్రాడిలా ఉండే నాని.. తన నేచురల్ యాక్టింగ్ తో సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్నాడు. గత ఏడాది నానికి మంచి హిట్ సినిమాలు పడ్డాయి. దసరా లాంటి రా అండ్ రస్టిక్ సబ్జెక్ట్ తో నాని తన ఖాతాలో మంచి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూలు చేసి.. నాని కెరియర్లో మైలురాయిగా నిలిచింది. ఇక ఇలాంటి సబ్జెక్ట్ తర్వాత నాని నటించిన చిత్రం హాయ్ నాన్న. ఇదోక ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

Hero Nani Mrunal Thakur Hi Nanna Movie Now Streaming in Netflix OTT Full Details Here

నాని హీరోగా తెరకెక్కిన 'హాయ్ నాన్న'ను నూతన డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. ఇక ఇందులో నానికి జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తండ్రికూతురు బంధం నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చింది. ఇక ఈ సినిమాలో నాని కూతురుగా చైల్డ్ ఆర్టిస్ట్ కియారా ఖన్నా అద్భుతంగా నటించింది.

Hero Nani Mrunal Thakur Hi Nanna Movie Now Streaming in Netflix OTT Full Details Here

జెర్సీ సినిమాలో ఫాదర్ గా మెప్పించిన నాని.. ఈ సినిమాలో సైతం నాని మరోసారి ఫాదర్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమాకు థియేటర్లలో మంచి ఆదరణ లభించింది. యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమా ఉన్నప్పటికీ... దానిని తట్టుకుని సూపర్ కలెక్షన్స్ ను వసూలు చేసింది. తండ్రికూతురి అనుబంధం.. అందమైన ప్రేమకథతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించాడు దర్శకుడు శౌర్యువ్.

ఇక నాని సినిమాకు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రసంశలు కురిపించారు. నాని, మృణాల్, కియారా నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఖుషి లాంటి అల్బమ్ అందించిన హేషమ్ అబ్ధుల్ వహాబ్ ఈ సినిమాకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలు కూడా అందించాడు. మ్యూజిక్ కు ఆడియెన్స్ మాత్రం ఫిదా అయిపోయారు. సెంటిమెంట్ ఎమోషనల్ డ్రామాతో అడియన్స్ మనసులను మరోసారి నాని గుండెల్ని పిండేశాడనే చెప్పాలి.

Hero Nani Mrunal Thakur Hi Nanna Movie Now Streaming in Netflix OTT Full Details Here

హాయ్ నాన్న ఇప్పటివరకు థియేటర్లలో అలరించగగా... ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తుంది. 'హాయ్ నాన్న' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జనవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. అర్ధరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ సినిమాను ఓసారి ఓటీటీలో కచ్చితంగా చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X