OTTలోకి అతి భయంకరమైన మిస్ట్రీ క్రైమ్ హారర్​ థ్రిల్లర్​.. మనుషులను చంపి గూడుకట్టే దెయ్యాన్ని చూశారా!

ఓటీటీ క్రేజ్ బాగా పెరిగిపోయింది. సినిమాలు, వెబ్​సిరీస్​లు ఒకదాని మించి మరొకటి వస్తున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న ఆర్టిస్ట్​ల నుంచి పెద్ద పెద్ద హీరోల వరకు అంతా దీనిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే సదరు ఓటీటీ సంస్థలు వాటిని ఎక్కువ తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా వీటిలో క్రైమ్​, హారర్ థ్రిల్లర్స్​కు విశేష ఆదరణ దక్కుతోంది. అవి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే తాజాగా మరో సరికొత్త భయంకరమైన మిస్ట్రరీ క్రైమ్ అండ్ హారర్​ థ్రిల్లర్​ వచ్చేందుకు రెడీ అయింది. మరి అది ఎప్పుడు, ఎందులో రానుంది పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

మరో సిరీసుతో...:హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా ప్రేక్షకులను మెప్పిస్టూ స్టార్ స్టేటస్​ కోసం ప్రయత్నిస్తున్న నటుడు నవీన్ చంద్ర. వరుస సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలతో పాటు పలు వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నారు. రీసెంట్​గానే జిగర్తాండ డబుల్ ఎక్స్‌ సినిమాతో మరింత పాపులారిటినీ సంపాదించుకున్నారు. ఇందులో క్రూరమైన పోలీస్ ఆఫీసర్​గా నటించి భయపెట్టారు. ఇప్పుడు ఇంతలోనే మరో సిరీస్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు.

Hero Naveen Chandra Inspector Rishi Web Series Streaming on Amazon Prime Video From March 29th Full Details Here

ఇన్ స్పెక్టర్ రిషి...:తాజాగా ఆయన నటించిన లేటెస్ట్ వెబ్​సిరీస్​ ఇన్‌ స్పెక్టర్‌ రిషి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దీనిని విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్​ హారర్​తో మంచి ఇంట్రెస్ట్​ను క్రియేట్ చేశాయి. అయితే తాజాగా దీని ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు.ఈ ప్రచార చిత్రం మిస్ట్రరీ థ్రిల్లర్​గా భయపెడుతూ సాగింది. ప్రతీ సీన్​ సస్సెన్స్​తో ఉత్కంఠగా ముందుకు వెళ్లింది. ఓ దట్టమైన అడవులో మనుషుల శవాల చుటూ గుడూ కట్టుకుని ఉండటాన్ని చూపించారు. అంతు చిక్కని హత్యల వెనక దెయ్యం ఉందని అందరూ నమ్ముతుండగా పోలీస్​ ఆఫీసర్లుగా ఎవరో సీరియల్ కిల్లర్ ఇదంతా చేస్తూ ఉన్నాడని అనుమానిస్తారు.

Hero Naveen Chandra Inspector Rishi Web Series Streaming on Amazon Prime Video From March 29th Full Details Here

అతి భయంకరమైన మనిషి..:కానీ చివరికి వారికి ఓ దెయ్యం లాంటి అతి భయంకరమైన మనిషి చెట్లలో నుంచి కనిపిస్తాడు. మరి నిజంగానే అది దెయ్యమా? లేదా ఎవరైనా అలాంటి రూపం వేసుకుని చేస్తున్నారా? అన్నది స్పష్టత రాలేదు. అయితే చట్టాలు అతీంద్రియ శక్తులను బంధించలేవు అని ఈ సిరీస్​ టైటిల్​కు క్యాప్షన్​ పెట్టడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీని బట్టి ఇందులో ఎవరో అతీంద్రియ శక్తుల ద్వారా ఈ హత్యలను చేస్తున్నట్లు అర్థమవుతోంది. మరి చివరిగా ఆ మిస్టరీని ఇన్‌స్పెక్టర్‌ రిషి ఎలా ఛేదించారన్నది తెలియాలంటే ఈ సిరీస్‌ తప్పక చూడాల్సిందే.

మొత్తం 10 ఎపిసోడ్స్...:ఈ సిరీస్​లో మొత్తం 10 ఎపిసోడ్‌లు ఉన్నాయి. తెలుగు, తమిళంలో పాటు ఐదు భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది. మార్చి 29 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. నందిని దీనికి దర్శకత్వం వహించారు. ఇంకా ఈ సిరీస్​లో సునైన, మాలిని జీవరత్నం, కన్నా రవి, కుమార్ వేల్, శ్రీకాంత్ దయాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X