ఫ్యాన్స్​కు Nikhil సడెస్ సర్​ ప్రైజ్​.. ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక అదే క్రేజ్ తో మళ్లీ పాన్ ఇండియా మూవీ స్పైతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఫ్యాన్స్ కు మాత్రం ఈ మూవీ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

అలా సక్సెస్ ట్రాక్ లోకి...:నిఖిల్... హ్యాపీడేస్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ చిత్రంలో అల్లరిగా ఉండే ఓ కుర్రాడి పాత్రలో కనిపించి.. ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ... బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లాడు. అయితే ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా... నిఖిల్ ప్రయత్నం మాత్రం ఆగలేదు. అయితే స్వామి రారా సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన నిఖిల్ కు.. ఆతర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Hero Nikhil Siddharth SPY movie will be streaming on on popular OTT platform Amazon Prime

వందల కోట్ల కలెక్షన్స్...:ఇక చందు మొండేటితో కార్తికేయ సినిమా చేశాడు. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించారు. పాన్ ఇండియా రేంజులో విడుదల చేయగా.. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తే.. వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో నిఖిల్ క్రేజ్.. పాన్ ఇండియా స్థాయికి చేరిపోయింది.

పాన్ ఇండియా రేంజ్..:ఇక ఆతర్వాత సుకమార్ రైటింగ్స్ లో.. ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ 18పేజస్ సినిమా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. మంచి లవ్ స్టోరీ కాన్సెప్టుతో వచ్చిన నిఖిల్... ప్రేక్షకులను మరోసారి మాయ చేశాడు. ఇదిలా ఉంటే.. మళ్లీ పాన్ ఇండియా రేంజులో స్పై మూవీతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయింది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు.

Hero Nikhil Siddharth SPY movie will be streaming on on popular OTT platform Amazon Prime

బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా..:స్పై చిత్రాన్ని ఎడిటర్ గ్యారీ బీ హెచ్ డైరెక్ట్ చేశాడు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా ఈ సినిమా వస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రాగా... ప్రేక్షకులు మాత్రం అప్సెట్ అయ్యారు. దానికి కారణం సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక రహస్యం అని చెప్పి.. సినిమాను వేరే యాంగిల్ ప్రజెంట్ చేశారని కామెంట్స్ వచ్చాయి.

Hero Nikhil Siddharth SPY movie will be streaming on on popular OTT platform Amazon Prime

సడెన్ సర్ ప్రైజ్...:ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎలాంటి ప్రకటన లేదు. అయితే సడెన్ గా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా గురువారం నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు గనుక థియేటర్లలో మిస్ అయితే ఈ ఓటీటీ వేదికగా సినిమాను చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X