OTTలోకి రవితేజ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఓటీటీ వేదికలు వచ్చాకా... థియేటర్ కు వెళ్లకుండా ఇంట్లోనే కొత్త కొత్త సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. దానికి తగినట్లుగానే చాలా ఓటీటీ సంస్థలు కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ కూడా నెలలోపే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అలా ఓ కామెడీ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఓటీటీలోకి మరో కొత్త చిత్రం రాబోతుంది. మాస్ మాహారాజా రవితేజ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. నిర్మించిన మూవీ ఛాంగురే బంగారు రాజా. ఇది చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి... మంచి టాక్ సొంతం చేసుకుంది. క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమాలో కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ కార్తిక్ రత్నం హీరోగా నటించాడు. గోల్టీ నిస్సీ, సత్య, రవిబాబు ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు సతీష్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సౌరబ్ సంగీతం అందించారు.

Hero Raviteja Changure Bangaru Raja Movie Going to Streaming on Etv Win OTT From October 27th

రవితేజ నిర్మించిన ఛాంగురే బంగారు రాజా సినిమా ప్రేక్షకుల ముందు సెప్టెంబర్ 15న వచ్చింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 27 నుంచి ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ‏లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయింది.

ఇక ఈ ఛాంగురే బంగారు రాజా సినిమా ఈటీవీ విన్ వేదికగా రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై రవితేజ నిర్మాతగా మారి నిర్మించారు. ఇందులో కార్తీక్ రత్నం హీరోగా నటించారు. కుషిత కల్లపు ఆయన సరసన హీరోయిన్ గా నటించింది. ఇందులో సత్య అక్కల, రవిబాబు, ఎస్తేర్ నోరోన్హా, అజయ్ కీలకపాత్రల్లో నటించారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే... రంగురాళ్ల బ్యాక్ డ్రాప్ లో మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కించారు. ఇందులో బంగార్రాజు అనే బైక్ మెకానిక్ పాత్రలో కార్తిక్ రత్నం నటించి మెప్పించారు. నర్సీపట్నం దుగ్గాడ ప్రాంతంలో ఉండే బంగార్రాజుకు అదే గ్రామంలో ఉండే సోము నాయుడు అనే వ్యక్తికి మధ్య గొడవ తలెత్తుతుంది. ఇక ఆ తర్వాతి రోజు సోము నాయుడు హత్యకు గురవుతాడు. దీంతో బంగార్రాజు చంపి ఉంటాడనే అనుమానంతో పోలీసులు అరెస్టు చేస్తారు.

Hero Raviteja Changure Bangaru Raja Movie Going to Streaming on Etv Win OTT From October 27th

మరి ఈ కేసు నుంచి బంగార్రాజు ఎలా బయటపడ్డాడు.. నిజంగానే హత్య చేశాడా... అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక క్రైమ్ కామెడీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. మీరు ఓటీటీలో ఓ మంచి క్రైమ్ కామెడీ మూవీ చూడాలనుకుంటే... ఇంట్లో కూర్చొని ఈ మూవీని చూసేయొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X