OTTలోకి నవ్వులు పంచే ఎమోషనల్ డ్రామా... ఎందులో చూడాలంటే?
ప్రతి వారం ఎన్నో కొత్త వెబ్ సిరీసులు, సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తూ ఉంటాయి. అయితే ఈసారి నవ్వులు పంచే ఎమోషలన్ డ్రామా ఓటీటీలోకి రాబోతుంది. అప్పట్లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన శివాజీ.. ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. అదే నైంటిస్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకులను నవ్విస్తునే ఎమోషనల్ చేస్తుంది. అయితే ఈ సిరిస్ ఎప్పుడు, ఎక్కడ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం.
ఓటీటీ ప్రేక్షకులను కడుబుబ్బా నవ్వించడానికి హీరో శివాజీ రెడీ అయిపోయాడు. 90స్ కాలంలో హీరో శివాజీ ఎన్నో సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను అలరించాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చాక.. కొన్నాళ్లు రాజకీయాల్లో బిజీ అయ్యాడు. ఇక ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. ఇక ఈ సీజన్ విన్నర్ ఆయనే అని అంతా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు శివాజీ.

ఇక శివాజీ హీరోగా ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వెబ్ సిరీస్ తెరెకెక్కింది. అదే '#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'. ఈ సిరీస్‌లో తొలి ప్రేమ సినిమా ఫేమ్ వాసుకీ ఆనంద్ శివాజీ భార్యగా నటించగా... మౌళి, వసంతిక, రోహన్, స్నేహల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆదిత్య హసన్.. ఈ వెబ్ సిరీసుకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న 90స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది.
'#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. న్యూ ఇయర్ కానుకగా జనవరి 5వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ విషయాన్ని ఈటీవీ విన్ సంస్థ అధికారికంగా అనౌన్స్ చేసింది. అంతే కాదు.. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఈ ట్రైలర్ ఆధ్యంతం నవ్వులు పూయిస్తూనే.. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.

ఇక ఈ ట్రైలర్ చూస్తే ఈ సిరీసులో శివాజీ లెక్కల మాస్టర్ చంద్రశేఖర్‌గా నటిస్తున్నాడు. శివాజీ గురించి అతడి కొడుకు తన క్లాస్ మేట్ కు వివరించే సీన్ తో ఈ ట్రైలర్ మొదలు అవుతుంది. ఇక ఈ ట్రైలర్ ఆధ్యంతం నవ్వులు పూయించింది. ఓ అమ్మాయిలు శివాజీని పలకరిస్తూ 'నేను సుచిత డేవిడ్ పాల్' అని అంటే, 'నాకు కేఏ పాల్ మాత్రమే తెలుసు' అంటూ శివాజీ చెప్పడం నవ్వులు పూయించింది.
ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలతో వినోదాత్మకంగా నైన్టీస్ వెబ్ సిరీస్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. అమోఘా ఆర్ట్స్, ఎంఎన్‌వో ప్రొడక్షన్స్ బ్యానర్లపైనవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం సంయుక్తంగా ఈ సిరీసును తెరకెక్కించారు. సురేశ్ బొబ్బలి మ్యూజిక్ అందించారు. ఇక ఈ సిరీస్ ను మీరు వచ్చే ఏడాది జనవరి 5న ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











