Chinna OTT Release: ఓటీటీలోకి రాబోతున్న సిద్దార్థ్ చిన్నా సినిమా.. ఎందులోనో తెలుసా?
హీరో సిద్దార్థ్.. ఈయన గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలతో ప్రేక్షుకలు ముందు వస్తూ.. ఫుల్లు హిట్లు కొట్టిన ఈయన తాజాగా చిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గుండెలు పిండేసే కథతో వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా తమిళంలో చిత్తా పేరుతో రూపొందించిన ఈ చిత్రాన్ని చిన్నా పేరుతో తెలుగులో విడుదల చేశారు. మెసేజ్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు ఎస్యూ అరుణ్ కుమార్ చిన్నా చిత్రాన్ని తెరకెక్కించాడు.
చిన్నా సినిమాలో హీరో సిద్దార్థ్ తో పాటు నిమిషా సజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్, ప్రధాన పాత్రల్లో కనిపించారు. కేవలం హీరోగా చేయడమే కాకుండా ఈ చిత్రానికి హీరో సిద్దార్థ్ యే ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. తమిళంలో నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 15 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగానే కలెక్షన్లను రాబట్టుకుంది. ప్రతీ ఒక్క ప్రేక్షకుడి మనసును తాకే విధంగా ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.

ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికీ ఈ చిత్రాన్ని చూడలేని వారు ఓటీటీ వేదికగా.. కుటుంబ సభ్యులతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సెప్టెంబర్ 28వ తేదీన తమళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం డిస్నే ప్లస్ హాట్ స్టాప్ వేదికగా నవంబర్ 17వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
చిన్నా సినిమాలో హీరో సిద్దార్థ్... ఈశ్వర్ అలియాస్ చిన్నాగా కనిపిస్తాడు. అయితే మున్సిపాలిటీలో ఓ చిరుద్యోగిగా పని చేసే ఇతడు.. తన అన్నయ్య చనిపోవడంతో అన్న కూతురు సుందరి అలియాస్ చిట్టి బాధ్యతలను తీసుకుంటాడు. ఈక్రమంలోనే చిట్టి స్నేహితురాలైన మున్ని లైంగిక దాడికి గురవుతుంది. అయితే ఆమెపై లైంగిక దాడికి పాల్పడింది చిన్నానే అని ఆరోపణలు వస్తాయి. సాక్ష్యంగా ఓ వీడియో కూడా వెలుగులోకి వస్తుంది. అయితే ఇదంతా నమ్మడానికే కష్టంగా ఉండగా.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
నిజంగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడింది చిన్నానేనా, ఇరు కుటుంబాలు ఈ షాక్ నుంచి తేరుకోకముందే చిన్నా అన్న కూతురు చిట్టి కూడా కనిపించకుండా పోవడం హైలెట్ గా నిలుస్తాయి. అయితే చిట్టి కనిపించకుండా పోవడం వెనక ఎవరు ఉన్నారు, అసలేం జరిగింది, చిన్నా పాపను పట్టుకోగలిగాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి నవంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడండి. ఫుల్లుగా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











