OTTలో భయపెడుతున్న హారర్ మూవీ... వారు మాత్రం ఈ సినిమాను చూడొద్దు!

ఈ మధ్య కాలంలో హారర్ సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువ దక్కుతోంది. స్టార్ కాస్ట్​తో సంబంధం లేకుండానే ఈ జానర్ చిత్రాలు చూడడానికి ప్రేక్షకులు మక్కువ చూపిస్తున్నారు. ఆ మధ్య మసూద, మా ఊరి పొలిమేర వంటి చిత్రాలు థియేటర్లలో రిలీజై మంచి హిట్లు అందుకున్నాయి. ఈ చిత్రాలకు ఆడియన్స్ నుంచి అటెన్షన్ బాగా దక్కడంతో మరో హారర్ సినిమా కూడా రీసెంట్​గా రిలీజై మంచి హిట్ అందుకుంది. ఆ చిత్రమే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. దాని గురించే ఈ కథనం..

రీసెంట్​ రిలీజ్​ తెలుగు హారర్ మూవీ 'పిండం'. చిత్రం డిసెంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్‌, ట్రైలర్‌తో మంచి బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బాగానే ఆడింది. ఈ చిత్రంలో హీరో శ్రీరామ్‌, ఖుషి రవి జంటగా నటించారు. ఈశ్వరి రావు, రవి వర్మ, అవసరాల శ్రీనివాస్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సాయికిరణ్‌ దైదా దర్శకత్వం వహించారు. యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మాతగా వ్యవహించారు.

Hero Sriram Horror Movie Pindam Streaming Now on AHA OTT Full Details Here

టైటిల్​తోనే బజ్​ క్రియేట్​ చేసిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ఈ చిత్ర ఓటీటీ రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగానే ఎదురుచూశారు. ఇప్పుడు వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేసిందీ సినిమా. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌, తెలుగు ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇది చూసిన వారు గతేడాది రిలీజైన వాటిలో బెస్ట్‌ హారర్‌ ఫిలిమ్​ ఇది సోషల్‌ మీడియాలో కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

మూవీ ఎలా ఉందంటే? ఈ చిత్రాన్ని ప్రస్తుతంతో పాటు 1990, 1930.. ఇలా మూడు కాలక్రమాలలో జరుగుతున్నట్టుగా చూపించారు. ఓ పాడుబ‌డిన ఇంట్లోకి హీరో కుటుంబం రావ‌డం, అందులో ఆత్మ‌లు ఉండ‌టం, వాటి నుంచి త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి హీరో చేసే పోరాటం.. ఇదే ఫార్ములాతోనే పిండం కూడా వచ్చింది. క‌థ రొటీనే అయినా సౌండ్స్‌, హార‌ర్ ఎలిమెంట్స్‌తో భ‌య‌పెట్టారు. కామెడీ, హీరోయిజం లాంటివేమి మిక్స్​ చేయలేదు.

Hero Sriram Horror Movie Pindam Streaming Now on AHA OTT Full Details Here

ఆంథోనీ పాత్ర‌లో నటుడు శ్రీరామ్ ఒదిగిపోయాడనే చెప్పాలి. ఆత్మ‌ల బారి నుంచి త‌న ఫ్యామిలీ కాపాడుకునే వ్య‌క్తిగా ఆయన న‌ట‌న ఆకట్టుకుంది. తాంత్రిక విద్య‌లు తెలిసిన మ‌హిళ‌గా ఈశ్వ‌రీరావు తన హావాభావాలతోనే భయపెట్టింది. ఖుషి ర‌వి తన పాత్రకు న్యాయం చేసింది. శ్రీనివాస్ అవ‌స‌రాల కూడా తన పాత్రకు న్యాయం చేశారు. ఫైనల్​గా ఈ హార‌ర్ సినిమా కాస్త భయపెడుతుంది. ఈ సినిమా రిలీజ్​కు ముందు కూడా సెన్సార్ బోర్డు గర్భణీలను, చిన్నపిల్లల్ని చూడొద్దని హెచ్చరించింది. మరి మీరు థియేటర్​లో ఈ సినిమా మిస్ అయితే ఉంటే ఈ వీకెండ్​లో చూసేయండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X