OTT ఫ్లాట్‌ఫామ్‌లో అతిథిగా రాబోతున్న సీనియర్ హీరో.. డిస్నీ+హాట్ స్టార్ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్‌లో తనదైన శైలిలో రాణించి విజయాలు, పరాజయాలతో తన మార్క్ క్రియేట్ చేసుకొన్నాడు నటుడు వేణు తొట్టెంపూడి. లవర్ బాయ్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. తాజాగా రవితేజ సినిమాతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. తాజాగా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. వేణు తొట్టెంపూడి నటించిన వెబ్ సిరీస్ వివరాల్లోకి వెళితే..
స్వయంవరం, హానుమాన్ జంక్షన్ లాంటి సినిమాలతో ఆకట్టుకొన్న నటుడు వేణు తొట్టెంపూడి కొద్దికాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి వస్తున్నాడు.

వేణు తొట్టెంపూడి నటించిన అతిథి సెప్టెంబర్ 19వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నది. ఈ సినిమా రాండమ్ ప్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రవీణ్ నిర్మాతగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భారత్ వైజీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు.

అతిథి వెబ్ సిరీస్ రిలీజ్‌కు ముందు ప్రమోషనల్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రేమ విఫలమైన అమ్మాయి సూసైడ్ చేసుకొని దెయ్యంగా మారడం లాంటి కథను రాసిన ఓ రైటర్ కథ. ట్రైలర్‌లో అర్ధరాత్రి భారీ వర్షం పడుతున్న సమయంలో ఓ అందమైన అమ్మాయి ఇంటి డోర్ కొడితే ఏమౌతుందనే పాయింట్‌తో సినిమాను తెరకెక్కించినట్టు ట్రైలర్‌లో స్పష్టమైంది. రైటర్‌గా వేణు రాసిన కథలో ఎలాంటి మలుపులు చోటు చేసుకొన్నాయనే విషయం సినమా చూస్తేనే గానీ తెలియదు. అప్పటి వరకు ట్రైలర్ పై లుక్ వేయండి..


Click it and Unblock the Notifications











