OTTలో రచ్చలేపుతున్న రొమాంటిక్ మూవీ... దీనిపై హీరో రియాక్షన్ ఏంటంటే?
లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ఖుషి. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇక ఓటీటీలో రిలీజ్ అవ్వగా... ఇప్పుడు ఈ మూవీ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. దీనిపై హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే....
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా.. సమంత హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం ఖుషి. మహానటి సినిమా తర్వాత ఈ జంట ఫుల్ లెంగ్త్ లో నటించిన చిత్రం ఇది. ఇక ఈ మూవీని శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఈ మూవీకి మలయాళం సంగీత దర్శకుడు హేశమ్ అబ్దుల్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

ఖుషి మూవీ లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లోకి వచ్చింది. ఇక ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్ ను తెగ అలరించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు బాగానే వసూలు చేసింది. ఇక ఈ మూవీ ఇటీవల ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక ఖుషి మూవీ నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండింగ్ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో మురళి శర్మ, సచిన్ కేడాఖర్, శరణ్య ప్రదీప్, వెన్నల కిషోర్ వంటి నటులు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీని ఓటీటీలో చాలా మంది ఆదరిస్తున్నారు. ఇక ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ పై హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. ఓటీటీలో మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసి విజయ్ దేవరకొండ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

విజయ్ దేవరకొండ చెబుతూ... "ప్రేమకు భాష తెలియదని... భావోద్వేగాలకు హద్దులు లేవనే నమ్మకంతో 'ఖుషి' చిత్రాన్ని రూపొందించాం. OTT విడుదలతో మళ్లీ కురిసిన ప్రేమను చూడటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో చూస్తున్నాం. కన్నడ, లేదా హిందీలో ఈ సినిమా మన హృదయాల్లోకి వచ్చినంత 'ఖుషి'ని మీ హృదయాల్లోకి తెస్తుందని ఆశిస్తున్నాను., అంటూ చెప్పుకువచ్చారు.

ఇక ఖుషి సినిమా విషయానికి వస్తే... హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే ఇరు కుటుంబాలు వారి పెళ్లికి ఒప్పుకోరు. ఇక హీరో హీరోయిన్లు రిజిస్టార్ మ్యారేజ్ చేసుకుంటారు. వారు పెళ్లి చేసుకున్న తర్వాత వారి మధ్య ఎలాంటి సమస్యలు వస్తాయి... వారు కలిసి ఉంటారా అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. మొత్తానికి ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. మీరు కనుక ఈ మూవీని మిస్ అయితే.. కనుక ఓటీటీలో చూసేయండి.


Click it and Unblock the Notifications











