నెల తిరక్కముందే OTTలోకి విశాల్ కొత్త సినిమా.. ఈ క్రేజీ మూవీని ఎక్కడ చూడాలంటే?
కొత్త వారం వచ్చిందంటే చాలు అనేక సరికొత్త చిత్రాలు ఓటీటీలోకి వస్తూ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్లలోకి వచ్చి నెల కూడా కాకముందే ఓటీటీలోకి వస్తుండగా.. ఓటీటీ ప్రియులు అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు సరికొత్త చిత్రాలు వస్తాయా అని సోల్ మీడియాలో వేదికగా అన్నింటినీ ఫాలో అవుతున్నారు. అయితే ఇటీవలే థియేటర్లలో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సరికొత్త యాక్షన్ డ్రామా ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
విశాల్ హీరోగా చేసిన రీసెంట్ యాక్షన్ డ్రామానే రత్నం. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే యోగాబుబ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మురళీ శర్మ, సముద్రఖని, హరీష్ పేరడి, రాజేంద్రన్, కార్తీక్ సుబ్బరాజు, వీటీవీ గణేష్, ఢిల్లీ గణేష్, తులసి, అశ్విన్ రాజా, గణేష్ వెంకట్ రమణ, జయ ప్రకాష్, జీవా రవి, పాండీ రవి వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం, సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు హరి దర్శకత్వం వహించాడు.

ఏప్రిల్ 26వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఎం సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు టి ఎస్ జయ్ ఎడిటింగ్ పనులు చూసుకున్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. ఇందులో రెండే రెండు పాటలు ఉన్నాయి. ఇలాంటి క్రేజీ యాక్షన్ డ్రామా తాజాగా ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా హక్కులను దక్కించుకునేందుకు అనేక ఓటీటీ సంస్థలు పోటీ పడగా.. ఎట్టకేలకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా హక్కులను దక్కించుకుంది.

అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో విశాల్ రత్నం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసింది. ముఖ్యంగా మే 23వ తేదీ నుంచి ఈ క్రేజీ మూవీని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది. నెల రోజుకు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి కూర్చుని.. మీ ఇంట్లోనే చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. డోంట్ మిస్ ఇట్.


Click it and Unblock the Notifications











