OTTలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్... ఎందులో చూడాలంటే?
వీకెండ్ వచ్చిందంటే... ఓటీటీ ప్రేక్షకులకు పండగే అని చెప్పవచ్చు. ఇక ఓటీటీలో పలు సినిమాలు సందడి చేస్తుండగా.. అందులో అందరి ఫోకస్ ఆ 100 కోట్లు వసూలు చేసిన సినిమా పైనే. అదేంటో కాదు... కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన సైన్స్ ఫిక్షన్ కామెడీ ఫిల్మ్ మార్క్ ఆంటోనీ. ఇక ఈ చిత్రం అక్టోబర్ 13 నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేస్తోంది. అసలు ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది... దీని కథేంటి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం మార్క్ ఆంటోనీ. ఇక ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య లీడ్ యాక్టర్ గా నటించారు. ఇక రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా కనిపించారు. కమెడియన్ సునీల్, సెల్వరాఘవన్ వైజీ మహేంద్రన్, మీరా కృష్ణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మార్క్ ఆంటోనీ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలోకి వచ్చింది.

ఎన్నో భారీ అంచనాల నడుమ మార్క్ ఆంటోనీ థియోటర్లోకి రాగా... మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఇక టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో కామెడీ టచ్ ను ఇచ్చి డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా థియేటర్ల వద్ద ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో విశాల్ నటన, ఎస్ జే సూర్య కామెడీ... ఈ సినిమాలో హైలెట్ గా నిలిచాయి.
మార్క్ ఆంటోనీ తమిళంతో పాటు.. తెలుగు, కన్నడ, మలయాళం, హీంది భాషల్లో రిలీజ్ అయింది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళం, తెలుగులోనే ఎక్కువగా వసూళ్లు రాబట్టగలిగింది. విశాల్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా మార్క్ ఆంటోనీ నిలిచింది. విశాల్ కెరియర్ లో వంద కోట్లు వసూళ్లు సాధించిన మొదటి సినిమా మార్క్ ఆంటోనీ. ఇక విశాల్ కి కూడా ఈ సినిమా మంచి కంబ్యాక్ ఇచ్చింది.

ఇక మార్క్ ఆంటోనీ సినిమా థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక ఈ శుక్రవారం అనగా... అక్టోబర్ 13 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా ఈ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఈ టైం ట్రావెల్ మార్క్ ఆంటోనీ సినిమా విషయానికి వస్తే... మినీ స్టూడియో బ్యానర్ పై ఎస్ వినోద్ కుమార్ తెరకెక్కించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను మీరు గనుక థియేటర్లలో మిస్ అయితే... ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











