OTTలోకి డైరెక్టుగా వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్... చూడాలంటే కాస్త డేర్ ఉండాల్సిందే!
ఓటీటీలో ప్రతివారం కొత్త కొత్త సినిమాలు వస్తూ సందడి చేస్తాయి. ఇక థియేటర్ కి వెళ్లి సినిమా చూసొచ్చే ఓపిక లేనివారికి ఓటీటీ ఓ బెస్ట్ ఆప్షన్. ఇక ఓటీటీ సంస్థలు కూడా కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. అంతే కాదు కొన్ని సినిమాలు డైరెక్టుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఓటీటీలోకి డైరెక్టుగా ఓ కొత్త మిస్టరీ థ్రిల్లర్ వచ్చేసింది. ఇక ఈ సినిమా చూడాలంటే కాస్త డేర్ ఉండాల్సిందే బాసూ.. అసలు ఆ సినిమా ఏంటి... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చూడాలంటే డేర్ ఉండాల్సిందే: వీకెండ్ వచ్చేసింది... ఓటీటీలోకి కొత్త సినిమాల సందడి మొదలైంది. ఇక కొన్ని థియేటర్లలో ఆడి ఓటీటీకి వస్తే... మరికొన్ని డైరెక్టుగా ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అందులో ఓ కొత్త సినిమా అందరిని భయపెడుతోంది. ఓటీటీలోకి ఓ మరో కొత్త మిస్టరీ థ్రిల్లర్ వచ్చేసింది. ఈ సినిమా చూడాలంటే మాత్రం కాస్త డేర్ ఉండాల్సిందే. ఇంతకీ ఆ సినిమా ఏంటో అనుకుంటున్నారా... ది గ్రేట్ ఇండియన్ సూసైడ్.

డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్: ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో డైరెక్టుగా రిలీజ్ అయింది. ఈ శుక్రవారం అర్దరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక ఈ సినిమాలో కుమారి 21ఎఫ్ భామ హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు విప్లవ్ కొనేటి దర్శకత్వం వహించారు. రామ్ కార్తీ, వీకే నరేశ్, పవిత్రా లోకేశ్, జయప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
చావును శాసించడం సాధ్యమా?: ఇక ఇప్పటికే ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా ట్రైలర్స్, టీజర్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా చూస్తే కూడా అంతే ఫీల్ కలిగించేలా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 6న ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఆహా ఇలా రాసుకువచ్చింది. చావును శాసించడం సాధ్యమా? మాట్లాడుకుందాం. ఈ అసాధారణమైన ప్రశ్నకి సమాధానం ఈ రాత్రి నుండి ..అన్ని విషయాలు మాట్లాడుకుందాం.' అంటూ చెప్పుకువచ్చింది.

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ కథేంటంటే: ఇక ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ కథ విషయానికి వస్తే... కొన్నేళ్ల క్రితం మదనపల్లె పట్టణంలో జరిగిన సామూహిక హత్యల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కారు ప్రమాదంలో బళ్లారి నీలకంఠం (నరేశ్) చనిపోతాడు. అయితే ఎలాగైనా ఆయనను తిరిగి బతికించాలని హెబ్బా పటేల్ తో సహా ఆమె కుటుంబ సభ్యులు అనుకుంటారు. ఇక ఆయనను ప్రేమించే వారు బలంగా కోరుకుని ప్రాణ త్యాగం చేస్తే మళ్లీ ఆయన తిరిగి వచ్చే అవకాశముందని సామూహికంగా బలవన్మరణానికి సిద్ధ పడుతారు.
మిస్టరీ థ్రిల్లర్ చూడాలంటే: మరోవైపు హెబ్బా పటేల్ ను ప్రేమించిన రామ్ కార్తీక్ దీనిని అంగీకరించడు. చివరకు అతనిని కూడా నమ్మిస్తారు హెబ్బా కుటుంబ సభ్యులు. మరి వాళ్లను అలా ఉసిగొల్పిందెవరు? ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవాలంటే ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమాను చూడాల్సిందే. మొత్తానికి ట్విస్టులు, సస్పెన్స్, డ్రామా, రొమాన్స్.. ఇవన్నీ కలగలపి మేకర్స్ దీనిని రూపొందించారు. ఇక ఈ సినిమా చూస్తుంటే మాత్రం మీకు వెన్నులో వణుకు పుడుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక మీరు ఓ మిస్టరీ థ్రిల్లర్ చూసి ఎంజాయ్ చేాయాలనుకుంటే... ఈ సినిమాను ఆహాలో ఇంట్లోనే కూర్చొని చూసేయండి.


Click it and Unblock the Notifications











