OTTలోకి హెబ్బా పటేల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే?
ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు, సిరీసులు వస్తూ ఉంటాయి. ఇక ప్రేక్షకులకు మిస్టరీ థ్రిల్లర్స్ అంటే కాస్త ఆసక్తి ఎక్కువే. ఇక ఓటీటీలోకి మరో మిస్టరీ థ్రిల్లర్ సినిమా రాబోతుంది. హీరోయిన్ హెబ్బా పటేల్ నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా డైరెక్టు ఓటీటీలోకి రాబోతుంది. ఇక ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది... ఎప్పుడు స్ట్రీమింగ్ అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మిస్టరీ థ్రిల్లర్స్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు. అందుకే ఓటీటీ సంస్థలు సైతం కొత్త కొత్త మిస్టరీ థ్రిల్లర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. మరో ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమా అయినా ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమా విడుదల కానుంది. వెన్నులో వణుకుపుట్టించే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది.

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్... అక్టోబర్ 6వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. రామ్ కార్తిక్, హెబా పటేల్ కీలక పాత్రల్లో నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ కు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే... ఆయనే ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. నరేష్ వీకే, పవిత్రా లోకేష్, జయప్రకాష్‌తో పాటు పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
ఇక ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా కథ విషయానకిి వస్తే.... మదనపల్లి టౌన్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ రూపొందింది. ఎమోషనల్ డ్రామా, మనసును తాకే థ్రిల్స్, అనూహ్యమైన రొమాన్స్, అన్నిటి మేళవింపుగా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

అనూహ్యమైన రీతిలో ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ కథ సాగుతుంది. ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడాలనుకుంటుంది. అసలు వాళ్ల ఉద్దేశం ఏంటి? మళ్లీ పుట్టడమేనా? ఈ కథను ముందుకెళుతున్న కొద్దీ అనూహ్యమైన ట్విస్టులు, సస్పెన్స్, డ్రామా, రొమాన్స్... ఇలాంటివి ఎన్నెన్నో కళ్లముందు కదలాడుతుంటాయని మేకర్స్ వెల్లడిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఇటీవల ఆమె ఓదెల రైల్వే స్టేషన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఆహాలోనే స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ తో మళ్లీ ఆహా ప్రేక్షకులను పలకరించనుంది హెబ్బా పటేల్. రీసెంట్‌గా మళ్లీ పెళ్లితో ఆహా ఆడియన్స్ ని అలరించిన నరేష్ వీకే, పవిత్రా లోకేష్ కూడా ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ లో భార్య భర్తలుగా నటించారు.

ఆద్యంతం సస్పెన్స్ తో ఇంతవరకూ కనీవినీ ఎరుగని థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించనుంది ది గ్రేట్ ఇండియాన్ సూసైడ్. అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. థ్రిల్లర్ జోనర్‌కి ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సరికొత్త నిర్వచనం చెప్పే సినిమా అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. మీరు కనుగ థ్రిల్లర్ ఫీల్ ను పొందాలంటే.. అక్టోబర్ 6న ఈ సినిమా ఓటీటీలోనే ఎంచక్కా చూసేయండి.


Click it and Unblock the Notifications











