OTT: వారాయ్ అంటూ మీ ఇంటికి వచ్చేస్తున్న కంగనా, భయపడేందుకు సిద్ధమైపోండి!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, డ్యాన్స్ మాస్టర్, హీరో రాఘవ లారెస్న్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం చంద్రముఖి-2. పి వాసు తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా రూపొందించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ పెద్ద ఎత్తునే ప్రమోషన్లు చేశారు. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మామూలుగా ఉందనే టాక్ తెచ్చుకుంది. టాక్ నార్మల్ గా ఉండడంతో జనాలు ఎవరూ పెద్దగా థియేటర్లకు వెళ్లలేదు.
ఓటీటీలోనో, టీవీల్లోనే వచ్చినప్పుడు చూడుచ్చులే అని చాలా మందే భావించారు. చంద్రముఖి 2 సినిమా వల్ల నిర్మాతలు దాదాపు రూ.20 కోట్ల వరకూ నష్టపోయారని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగులో అయితే అట్టర్ ఫ్లాప్ గా నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది. థియేటర్ లో నిరాశపరిచిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. అక్టోబర్ 27వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఆన్ లైన్ లో దర్శనం ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా చంద్రముఖి 2 తమిళ వెర్షన్ కు సంబంధించి హెచ్డీ ప్రింట్ ను పైరసీ సైట్ తో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తెగ వైరల్ అయింది. థియేటర్లలో చంద్రముఖి 2 చిత్రాన్ని చూడలేని వాళ్లు అక్టోబర్ 27వ తేదీ నుంచి ఇంట్లోనే కూర్చొని చూసేయవచ్చు. అయితే చిత్రబృందం ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. చూడాలి మరి ఎప్పుడు ప్రకటిస్తారో.
2005లో విడుదలైన చంద్రముఖి సినిమా పూర్తిస్థాయి హర్రర్ చిత్రంగా తెరకెక్కగా.. అప్పట్లో తమిళ చిత్రాలకు తెలుగులో హైప్ క్రియేట్ అయింది. తమిళంలో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో కూడా అంతే హిట్ అయ్యి కలెక్షన్లలలో కొత్త రికార్డులను సృష్టించింది. మళ్లీ ఇంతకాలం తర్వాత అలాంటి ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ రాగా.. అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. ముందుగా హైప్ క్రియేట్ చేయగల్గిన చిత్రబృందం ప్రేక్షకులను థియేటర్ల వద్దకు రప్పించడంలో, సినిమా పూర్తి అయ్యేవరకు కూర్చోబెట్టడంలో పూర్తిగా విఫలం అయ్యారు.

చంద్రముఖి 2 సినిమా ఎలా ఉన్నప్పటికీ... విడుదలైన వారంలోనే దేశవ్యాప్తంగా రూ.28 కోట్ల కలెక్షన్లను సాధించింది. అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ చిత్రాన్ని 8 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. మామూలుగా సినిమా థియేటర్లలో విడుదల అయిన ఆరు నుంచి 8 వారాల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదు కాబట్టి ఈ సినిమాను ఇంత లేట్ గా రిలీజ్ చేస్తున్నారు. లేదంటే ఈపాటికే ఈ చిత్రం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేది.


Click it and Unblock the Notifications











