For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Radha: అలనాటి హీరోయిన్ రాధ కంటతడి.. కమెడియన్ ఆ మాట అనడంతో తట్టుకోలేక!

  |

  ఇటీవలే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ పూర్తయింది. బిగ్ బాస్ లవర్స్ కి, ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్ చేసేందుకు సరికొత్తగా బీబీ జోడీ అనే రియాలిటీ డ్యాన్స్ షోని తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు జోడిలుగా తమ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టనున్నారు. ఇలా బీబీ జోడి డ్యాన్స్ షో కూడా ప్రస్తుతం మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక తర్వాతి వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఓ కమెడియన్ అన్న ఒక్క మాటతో అలనాటి స్టార్ హీరోయిన్ రాధ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఎందుకలా ఏడ్చిందనే వివరాల్లోకి వెళితే..

  బీబీ జోడి పేరుతో డ్యాన్స్ షో..

  బీబీ జోడి పేరుతో డ్యాన్స్ షో..

  సెలబ్రిటీ షో గా ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షోలో మొదట్లో సెలబ్రిటీలే ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సీజన్ లు పెరిగినకొద్ది.. సీరియల్ నటినటులు, సోషల్ మీడియా స్టార్స్, రివ్యూవర్స్, యాంకర్స్, జర్నలిస్ట్స్ ఇలా విభిన్న నైపుణ్యాలు కలిగిన వ్యక్తులను కంటెస్టెంట్లుగా తీసుకొచ్చారు. ఇక వాళ్లందరు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాక ఉదయం పూట డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంటారు. ఈ కంటెస్టెంట్లలో ఎంతోమంది డ్యాన్సర్స్ ఉన్నారు. వారందరిచేత బీబీ జోడీలో డ్యాన్స్ చేయిస్తున్నారు.

  న్యాయ నిర్ణేతగా హీరోయిన్ రాధ..

  న్యాయ నిర్ణేతగా హీరోయిన్ రాధ..

  బీబీ జోడీ డ్యాన్స్ షోలో జోడీలుగా అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్విని, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-స్రవంతి, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్, అవినాష్-అరియానా, మెహబూబ్-అషు రెడ్డి ఉన్నారు. వీరందరికి యాంకర్ గా బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి వ్యవహరించనుంది. అలాగే న్యాయ నిర్ణేతలుగా అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు బ్యూటిఫుల్ హీరోయిన్ సదా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టార్ కొనసాగనున్నారు.

  శ్రీముఖి ఫొటోలు వైరల్..

  శ్రీముఖి ఫొటోలు వైరల్..

  శని, ఆది వారాల్లో ప్రసారమయ్యే ఈ బీబీ జోడీ తర్వాతి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో బ్లాక్ బస్టర్ రౌండ్ లో భాగంగా డాన్స్ పర్ఫార్మెన్స్ తో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బాగానే ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖి అయితే తన గ్లామర్ తో కూడా మరోసారి షాక్ ఇచ్చింది. ఆమె పొట్టి నిక్కరులో థైస్ అందాలు హైలైట్ అయ్యేలా కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ షోలోని శ్రీముఖి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  మీ స్ట్రాటజీ నాకు అర్థమవుతుంది..

  మీ స్ట్రాటజీ నాకు అర్థమవుతుంది..

  ఈ షోకి ధమాకా మూవీ హీరోయిన్ శ్రీలీల వచ్చి సందడి చేసింది. ఆమెతో కలిసి రాధ మిగాతా జడ్జెస్ డ్యాన్స్ చేశారు. తర్వాత రోల్ రైడా, ఇనయా సుల్తానా డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చారు. తరుణ్ మాస్టర్ పేపర్ చింపేసి డ్యాన్స్ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. అరియానా-అవినాష్ జోడీ మాత్రం 6 పాయింట్స్ ఇచ్చారు. ఫీమెల్ లిరిక్స్ నువ్ పాడేశావ్ దానివల్లే అని అవినాష్ క్లారిటీ ఇస్తుంటే.. మీ స్ట్రాటజీ నాకు అర్థమవుతుంది అని ఇనయా అంది.

  సూపర్ స్టార్ కృష్ణ వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ..

  సూపర్ స్టార్ కృష్ణ వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ..

  ఇనయా అలా అనడంతో.. ఇది బిగ్ బాస్ అనుకుంటున్నావ్.. ఇది బిగ్ బాస్ కాదు అని అవినాష్ అంటే.. ఇది బిగ్ బాస్ (బీబీ) జోడీనే అని ఇనయా అంది. పాజిటివ్స్ తీసుకున్నప్పుడు నెగెటివ్స్ కూడా తీసుకోండని అవినాష్ అన్నాడు. తర్వాత అరియానా-అవినాష్ డ్యాన్స్ చేసి అలరించారు. దాని తర్వాత రాధ గారు ఎలా ఉన్నారు అంటూ సూపర్ స్టార్ కృష్ణ వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ మాట్లాడాడు కమెడియన్ అవినాష్.

  కన్నీరు మున్నీరుగా రాధ..

  అలా సూపర్ స్టార్ కృష్ణ వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ అవినాష్ మాట్లాడేసరికి రాధ ఒక్క సారిగా ఎమోషనల్ అయింది. కృష్ణ లేరు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంటూ కన్నీరు మున్నీరైంది. ఆయన్ను ఎంతగానో మిస్ అవుతున్నాని.. ఐ రియల్లీ లవ్ హిమ్ అంటూ ఏడుస్తూ బాగా ఎమోషనల్ అయింది. దీంతో ప్రోమో ఎమోషనల్ గా ఎండ్ అయింది. అప్పట్లో కృష్ణ అనేక చిత్రాల్లో రాధ హీరోయిన్ గా చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాధ ఎమోషనల్ అయిన పార్ట్ ను ప్రోమో నుంచి తొలగించారు. అందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. మరి పూర్తి ఎపిసోడ్ లో ఉంచుతారో, తొలగిస్తారో వేచి చూడాలి.

  English summary
  Senior Heroine Radha Remembering Superstar Krishna And Gets Very Emotional In BB Jodi Reality Dance Show
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X