OTTలోకి వచ్చేసిన పిరియాడికల్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ... ఎక్కడ చూడాలంటే?
ప్రతి వారం ఓటీటీలో కొత్త కంటెంట్ వస్తునే ఉంటుంది. ఈ వారం కూడా కొన్ని సినిమాలు, సిరీసులు అలరిస్తున్నాయి. అయితే ఓటీటీలోకి ఓ పిరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్ సైలెంటుగా వచ్చేసింది. హీరోయిన్ రెజీనా నటించిన నేనే నా మూవీ గత నెలలో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ మూవీ ఓటీటీలోకి ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా వచ్చేసింది. ఇక ఈ మూవీ ఈ శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథేంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శివ మనసులో శృతి సినిమా అంటూ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రెజీనా. ఇక ఈ సినిమాలో సుదీర్ బాబు హీరోగా నటించారు. ఇక ఈ మూవీ తర్వాత రొటిన్ లవ్ స్టోరీ అంటూ మరోసారి హిట్టును తన ఖాతాలో వేసుకుంది. అలా కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూ.. ఎన్నో సూపర్ హిట్టు సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఈ భామకు తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి.

కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు నటించి... క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ గత ఏడాది చిరంజీవితో కలిసి ఓ ఐటెం సాంగ్ లో నటించింది. ఆచార్య మూవీలో సానా కష్టం వచ్చింది అంటూ చిరుతో కలిసి స్టేప్పులు వేసింది. ఇక ఈ మూవీ తర్వాత నివేదా థామస్ తో కలిసి శాకిని డాకిని సినిమాలో నటించింది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.
ఈ సినిమా తర్వాత చాలా రోజుల అనంతరం నేనేనా అనే మూవీలో నటించింది. నేనే నా చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించారు. రాజ్‌శేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహారించారు. ఇక ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి నేనే నా మూవీకి అంతగా టాక్ రాలేదు. దీనితో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది.

ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ రెజీనా నటించిన నేనే నా మూవీ అవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఓ మిస్టరీ కథాంశంతో రూపొందిన చిత్రం నేనే నా. ఇందులో రెజీనా ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటించి మెప్పించింది. ఇక థియేటర్లలో మెప్పించని సినిమాలు ఓటీటీలో హిట్ టాక్ తెచ్చుకున్న దాఖాలాలు ఉన్నాయి. మరి రెజినా సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ఇక నేనే నా సినిమా కథ విషయానికొస్తే.. ఇందులో యువరాణిగా, ఆర్కియాలజిస్టుగా డబుల్ రోల్ చేసింది రెజీనా. అడవిలో అనుమానాస్పదంగా చనిపోయిన ఓ విదేశీయుడి హత్య కేసులో పోలీసులు ఆర్కియాలజిస్ట్ దివ్య (రెజీనా) హెల్ప్ తీసుకుంటారు. అయితే ఆ హత్య చేసింది రెజీనా రూపంలో ఉన్న మరో వ్యక్తి అని పోలీసులు తెలుసుకుంటారు. మరి ఆర్కియాలజిస్టు దివ్యకు, గత జన్మలో యువరాణి అయిన దమయంతికీ మధ్య సంబంధం ఏంటి? ఆ హత్య చేసింది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మీరు గనుక థ్రిల్ ను కోరుకుంటూ ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి.


Click it and Unblock the Notifications











