The Road OTT: ఓటీటీలోకి రాబోతున్న త్రిష థ్రిల్లర్ మూవీ, ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
త్రిష.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆమె అందం, అభినయానికి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ కూడా ఉంది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో నటించి ఈ ముద్దుగుమ్మ తాజాగా ది రోడ్ అనే చిత్రంలో నటించింది. త్రిష ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాను అరుణ్ వశీగరన్ డైరెక్ట్ చేశారు. అక్టోబర్ పదో తేదీన విడుదలైన ది రోడ్ సినిమా థియేటర్ల వద్ద పాజిటివ్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా విడుదల అయిన నెల రోజులకే ఈ చిత్రం ఓటీటీలోకి అడుగు పెట్టబోతుంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ గా కనిపిస్తుంది.
తమిళనాడులోని జాతీయ హైవేలపై జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. జాతీయ హైవేలోని ఒకటే ప్రదేశంలో వరుసగా హత్యలు జరగుతూ ఉంటాయి. అయితే ఈ ఫేక్ యాక్సిడెంట్లకు పాల్పడుతూ.. ప్రలజను దోచుకుంటున్న ఓ ముఠా గుట్టును రట్టు చేసే పాత్రలో త్రిష కనిపించింది. ఇలాంటి రోడ్డు ప్రమాదంలోనే మరణించిన తన భర్త, కొడుకు మరణాలపై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుందనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ.. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో కొత్తగా ప్రెజెంట్ చేశారు.

ది రోడ్ చిత్రంలో త్రిషతో పాటు షబ్బీర్, సంతోష్ ప్రతాప్, మియా జార్జ్, ఎమ్మెస్ భాస్కర్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే వివేక్ ప్రసన్న, వేలా రామ్మూర్తి, ఎం.ఎస్ భాస్కర్, గణేష్ గోపీనాథ్, లక్ష్మిప్రియ, సాత్విత్ లు కూడా ఈ సినిమాలో నటించారు. ఏఏఏ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు. కేజీ వెంకటేష్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా... ఏఆర్ శివరాజ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు.
థియేటర్ల వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ చిత్రం హక్కులను దక్కించుకుంది. ఈక్రమంలోనే నవంబర్ 6వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ముందుగా ఈ సినిమాను తమిళ ఓటీటీలో విడుదల చేస్తారు. ఆ తర్వాత వివిధ భాషల్లో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంకెందుకు ఆలస్యం.. క్రైమ్ అండ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











