OTTలోకి వచ్చేసిన రీసెంట్ క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎందులో చూడాలంటే?
ఈ వీకెండ్ కు ఏ సినిమా చూడాలి అని ఆలోచిస్తున్నారా.. అయితే త్రిష నటించిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం త్రిష.. ఫుల్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆమె నటించిన చిత్రం ది రోడ్. ఈ మూవీ అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుంది. ఇప్పుడు సరిగ్గా నెల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమా కథేంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అందాల భామ త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు పెంచింది. నాలుగు పదుల వయసు వచ్చినా.. ఏ మాత్రం అందం తగ్గలేదు. వయసు పెరిగినా కొద్ది అందం పెరుగుతోంది. మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ సీరిసులతో మరింత క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. ఇక ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ ను మించిన అందంతో కనిపించి ప్రేక్షకులను మైమరిపించింది. ఇక ఆ తర్వాత విజయ్ తో కలిసి లియో చిత్రంలో నటించింది. ఇక ఈ మూవీ సంచలన వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

లియో చిత్రానికి ముందు త్రిష ఓ ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రంలో నటించింది. అదే ది రోడ్.. రివెంజ్ ఇన్ 462 కిలో మీటర్స్ అనేది క్యాప్షన్. ఇక ఈ మూవీకి అరుణ్ వశీగరణ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగు, తమిళ్ లో అక్టోబర్ 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ మూవీకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీకి మంచి ఆదరణ వచ్చింది.
బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన త్రిష ది రోడ్ సినిమా... ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ గా నటించిన త్రిషకు మంచి గుర్తింపు వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ది రోడ్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్సేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా... త్రిష సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ ధరకు విక్రయించింది. ఇక నవంబర్ 10 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఇక త్రిష ది రోడ్ సినిమా విషయానికి వస్తే... జాతీయ హైవేలపై జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ది రోడ్ సినిమాను రూపొందించారు. జాతీయ హైవేలోని ఒక ప్రదేశంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. అసలు ఈ హత్యల వెనక రహాస్యం ఏంటి... దాని వెనుక ఎవరు ఉన్నారు అనేది.. త్రిష తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో త్రిషకు ఎలాంటి అనుభవాలు ఎలాంటి ఎదురయ్యాయోనేది ఈ సినిమా స్టోరీ. ఈ క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో మాలీవుడ్ నటుడు షబీర్ ప్రదాన పాత్రలో నటించారు. మరి థియేటర్లలో ది రోడ్ సినిమాను మిస్ అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసేయండి.


Click it and Unblock the Notifications











