Hey Balwanth OTT Release: హే బలవంత్ ఓటీటీ డిటెయిల్స్.. సుహాస్ మూవీ ఎందులో? స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

చిన్న నిర్మాతలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు సుహాస్. ఆయనతో సినిమా తీస్తే మినిమమ్ గ్యారంటీ అని నిర్మాతలు భావిస్తున్నారు. సినిమాలతో పాటు ఓటీటీలోనూ తన హవా చాటుకుంటున్నారు సుహాస్. తాజాగా ఆయన నటించిన చిత్రం హే బలవంత్. కామెడీ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దానికంటే ముందే ఫిబ్రవరి 19న తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి. ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది.

హే భగవాన్ టైటిల్ మార్పు
తొలుత ఈ సినిమాకు హే భగవాన్‌ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే సెన్సార్ బోర్డ్ నుంచి అభ్యంతరాల నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమాకు హే బలవంత్ అనే టైటిల్‌గా మార్చింది. విడుదలకు నాలుగు రోజుల ముందు ఇలా పేరు మార్చాలన్న సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై చిత్ర పరిశ్రమలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయితే సీబీఎఫ్‌సీ ఆదేశాల మేరకు సుహాస్ సినిమాకు టైటిల్‌ను మార్చారు మేకర్స్.

Hey Balavanth OTT Release Date Suhas film s Satellite and Digital Rights Details here

హే బలవంత్ తారాగణం
త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బీ నరేంద్ర రెడ్డి ఈ హే బలవంత్ సినిమాను నిర్మించగా.. గోపీ అచ్చెర దర్శకత్వం వహించారు. హే బల్వంత్‌లో లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివానీ నాగారం హీరోయిన్‌గా నటిస్తుండగా.. వీకే నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్, అన్నపూర్ణమ్మ, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. మహీరెడ్డి పాండుగుల సినిమాటోగ్రాఫర్‌గా, విప్లవ్ నైషదం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్‌తో పాటు హే బలవంత్ మూవీ ఓటీటీ ఫ్లాట్‌ఫాం గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ వివరాలు పరిశీలిస్తే...

హే బలవంత్‌ నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు
సుహాస్ ట్రాక్ రికార్డ్.. టీజర్, ట్రైలర్ల కారణంగా హే బలవంత్ మూవీకి మంచి బిజినెస్ జరిగినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ బిజినెస్ కూడా త్వరగానే పూర్తి చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం హే బలవంత్ మూవీ శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ 5 సంస్థలు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నాయి. అయితే ఆ డీల్ వాల్యూ ఎంత అనేది మాత్రం తెలియరాలేదు.

హే బలవంత్ ఏ ఓటీటీలో? స్ట్రీమింగ్ ఎప్పుడు?
థియేటర్‌లో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవ్వాలనే ఒప్పందం మేరకు మేకర్స్‌కి జీ5తో డీల్ సెట్ అయ్యింది. దీనిని బట్టి హే బలవంత్ మూవీ మార్చి 3వ వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ ముందుకు రావొచ్చు.. ఆలస్యంగా రిలీజ్ కావొచ్చు. హే బలవంత్ ఓటీటీ రిలీజ్‌పై త్వరలోనే జీ 5 అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Read more about: suhas zee5 Hey Balwanth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X