twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Highway review: కొత్తదనం కొరవడిన సైకో థ్రిల్లర్.. ఆనంద్ దేవరకొండ ఎలా చేశాడంటే?

    |

    Rating:
    2.0/5

    నటీనటులు: ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ, మానస రాధాకృష్ణన్, సయామీ ఖేర్, సురేఖవాణి తదితరులు
    దర్శకత్వం కేవీ గుహన్
    నిర్మాతలు: వెంకట్ తలారీ
    మ్యూజిక్: సైమన్ కే కింగ్
    సినిమాటోగ్రఫి: కేవీ గుహన్
    ఎడిటర్: తమ్మిరాజు
    ఓటీటీ రిలీజ్ డేట్: 2022-08-19

    Highway Telugu movie review

    ఏపీలో మహిళలను అతి దారుణంగా, కిరాతకంగా చంపుతూ సైకో కిల్లర్ D (అభిషేక్ బెనర్జీ) పోలీసులకు సంచలనం రేపుతుంటాడు. మహిళల వరుస హత్యలు చేస్తూ ఆ ప్రాంత ప్రజలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంటాడు. ఇక విష్ణు (ఆనంద్ దేవరకొండ) విశాఖపట్నంకు చెందిన ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తుంటాడు. బెంగళూరులో పెళ్లి కార్యక్రమం ఫోటోలు తీయడానికి తన స్నేహితుడు సముద్ర (సత్య)తో కలిసి బెంగళూరు వెళ్తుంటాడు. ఇంటి నుంచి మంగళూరుకు పారిపోతూ తులసి (మానస రాధాకృష్ణన్) విష్ణును కలుస్తుంది. ఈ క్రమంలో తులసిని సైకో కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు.

    హైవే రోడ్డులో సైకో కిల్లర్ ఎందుకు వరుస హత్యలు చేస్తుంటాడు? అతడి హత్యల వెనుక కారణం ఏమిటి? ఇంటి నుంచి తులసి ఎందుకు పారిపోయింది? విష్ణును కలిసిన తులసి ఎలా అతడికి దగ్గరైంది. సైకో కిల్లర్ ఏ పరిస్థితుల్లో తులసిని కిడ్నాప్ చేశాడు?. కిడ్నాప్ గురైన తులసిని ఎలా? ఎవరు విడిపించారు? చివరికి సైకో కిల్లర్ పరిస్థితి ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే హైవే.

    118 చిత్రంతో దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఏ మాత్రం కొత్తదనం లేని కథతో పెద్ద సాహసమే చేశాడా అనిపిస్తుంది. నాసిరకమైన యాక్టర్లు, సరైన క్యారెక్టరైజేషన్ లేని పాత్రలతో ఆద్యంతం కథ బోరింగ్‌గా సాగుతుంది. సైకో కిల్లర్‌ను వేటాడే పోలీస్ ఆఫీసర్ ఆషా భారతీ పాత్రలో సయామీ ఖేర్ మెప్పించలేకపోయింది. వెరసి ఈ సినిమా ఆకట్టుకొలేని సైకో థ్రిల్లర్‌గా మారిపోయింది.

    హైవే చిత్రంలో ఎలాంటి ప్రాధాన్యం, విలక్షణత, వైవిధ్యం లేని పాత్రలో ఆనంద్ దేవరకొండ కనిపించాడు. ఏ మాత్రం ఫీల్ గుడ్ అంశాలు లేని విష్ణు పాత్రతో ఆకట్టుకొలేకపోయాడు. ఇక తులసి పాత్రలో మానస రాధాకృష్ణన్ రోల్ కూడా నామమాత్రమే. ఇక సైకో కిల్లర్‌ా అభిషేక్ బెనర్జీ మొత్తంగా రెండు మూడు రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇరిటేట్ చేశాడు. ఇలా రొటీన్ పాత్రలు, నాసిరకమైన సన్నివేశాలతో చాలా బోరింగ్‌ థ్రిల్లర్‌గా హైవే సాగింది. సముద్రగా సత్య కామెడీ కూడా వర్కవుట్ అయినట్టు అనిపించదు. కామెడీ ట్రాక్ కూడా సరిగా లేకపోవడం వల్ల కథ మూసధోరణితో ముందుకు సాగుతుంది. జాన్ విజయ్ పాత్ర ఎందుకో అర్ధం కాని పరిస్థితి.

    ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కాస్తలో కాస్త సైమన్ కే కింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేసేలా ఉంటుంది. గుహన్ కెమెరా వర్క్ ఒకేలా అనిపిస్తుంది.

    సైకో కిల్లర్ వరుస హత్యల కథా నేపథ్యంతో రూపొందిన సాదాసీదా చిత్రం హైవే. బలహీనమైన కథ, కథనాలు, కొత్తదనం లేని కథ, థ్రిల్లింగ్ మూమెంట్స్ లేని కథనం వెరసి ఈ సినిమా యావరేజ్‌గా కూడా అనిపించదు. మీకు వీలైనంత సమయం, ఓపిక ఉంటే.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూడండి.

    English summary
    KV Guhan and Anand Deverakonda's Highway is psycho Thriller drama hits the OTT on AHA. Here is the filmibeat Telugu exclusive review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X