OTTలోకి లోకల్ సూపర్ హీరో సినిమా.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ప్రస్తుత కాలంలో సినీ ప్రియులు ఎక్కువగా ఫాలో అవుతుంది ఓటీటీలను. అందులో వచ్చే డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ ద్వారా ఇంట్లో ఉండటంతో ఓటీటీలు చూసి వినోదాన్ని ఆస్వాదించారు. ఇప్పుడు థియేటరల్లో సినిమాల్లో చెప్పలేని, చూపించలేని కథలను వెబ్ సిరీసుల రూపంలో ఆవిష్కరిస్తున్నారు దర్శకనిర్మాతలు. అలాగే థియేటర్లలో విడుదలైన సినిమాలను కూడా ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అలా ఇప్పుడు ఒక లోకల్ సూపర్ హీరో మూవీ సందడి చేయనుంది.

తెలుగు ప్రేక్షకులకు సూపర్ హీరో మూవీస్ కొత్తేం కాదు. ఎందుకంటే హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన మార్వెల్, డీసీ ఎప్పటికప్పుడు సూపర్ హీరో, వుమెన్ పాత్రలతో సినిమాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుంటారు. ఇక వాటికి వరల్డ్ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో సౌత్ సూపర్ హీరో సినిమాలు కూడా రావడం మొదలయ్యాయి. ఆగస్టులో హను-మాన్ సూపర్ హీరో మూవీ అలరించేందుకు రెడీగా ఉండగా.. మలయాళంలో ఇదివరకే మిన్నల్ మురళి సినిమా సంచలనం సృష్టించింది.

Hiphop Tamizha Super Hero Movie Veeran Released In Amazon Prime Video OTT

నేరుగా ఓటీటీలో విడుదలైన మిన్నల్ మురళి సినిమాకు యావత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక సౌత్ ఇండస్ట్రీలో కూడా స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటి సినిమాలు రానున్నాయని అనుకున్నారు. ఇప్పుడు దాన్ని మరింతగా నిజం చేస్తూ తమిళంలో వచ్చిన సూపర్ హీరో సినిమానే 'వీరన్' (Veeran). కోలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ ప్రధాన పాత్ర పోషించిన ఈ తమిళ లోకల్ మూవీ జూన్ 2న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇప్పుడు వీరన్ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. వీరన్ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 30 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వీరన్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. కాబట్టి, జూన్ 30 నుంచి ప్రైమ్ వీడియోలో వీరన్ స్ట్రీమింగ్ కానుంది. ఫాంటసీ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వీరన్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X