HIT 3 OTT Release: హిట్ 3 ఏ ఓటీటీలో?.. నాని క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హిట్ ఫ్రాంఛైజ్‌లో భాగంగా డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్ ది థర్డ్ కేస్ .. హిట్ 3. నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా నాని కెరీర్‌లో 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. తాజాగా హిట్ 3 ఓటీటీ రిలీజ్‌పై వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
హిట్ 3 బడ్జెట్ ఎంత?
హిట్ 3లో సూర్య శ్రీనివాస్, రావ్ రమేశ్, సుముద్రఖని, కోమలీ ప్రసాద్, నెపోలియన్, ప్రతీక్ బబ్బర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ స్వరాలు అందించగా.. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందంచారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యింది. హిట్ ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్, నాని ఛరిష్మా, టీజర్, ట్రైలర్ల కారణంగా హిట్ 3 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.

హిట్ 3 బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. అలాగే డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మే 1న ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
హిట్ 3 కలెక్షన్స్
హిట్ 3 సినిమాకు ఇండియా వైడ్‌గా 19 రోజుల వరకు రూ. 78 కోట్ల నికర వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.71.8 కోట్ల నెట్ వచ్చింది. తమిళంలో రూ.1.80 కోట్ల నెట్, కన్నడంలో 53 లక్షల నెట్, హిందీలో రూ.3.90 కోట్ల నెట్, మలయాళంలో రూ.78 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.25 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. రాష్ట్రాల వారీగా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే.. కర్ణాటకలో రూ.11.36 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.70.6 కోట్లు, తమిళనాడులో రూ.3.36 కోట్లు, కేరళలో రూ.1.12 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.5.41 కోట్లు చొప్పున ఇండియాలో రూ.91.85 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్‌లో రూ.25 కోట్లు + ఇండియాలో వచ్చిన గ్రాస్ వసూళ్లు 92 కోట్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.117 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది హిట్ 3.
హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రెండు వారాల వరకు ఫర్వాలేదని అనిపించినా మూడో వారం తర్వాతి నుంచి కలెక్షన్స్ పడిపోవడంతో త్వరలోనే హిట్ 3 థియేట్రికల్ రన్ ముగుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు.. హిట్ 3ని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూస్తామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్కంఠకు తెరదించారు మేకర్స్. హిట్ 3 ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్‌లలో రిలీజైన 5 వారాల తర్వాత ఓటీటీలోకి రావాలన్న ఒప్పందానికి అనుగుణంగా జూన్ 5న హిట్ 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











