HIT 3 OTT Release : ఓటీటీలోకి హిట్ 3 .. నాని క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పుడు?.. ఎందులో అంటే?

సరిపోదా శనివారంతో గతేడాది ఘన విజయాన్ని అందుకున్నారు నేచురల్ స్టార్ నాని. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా ఉన్న ఆయన మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. దసరా నుంచి నాని తన రూట్ మార్చి మాస్ సినిమాలే చేస్తున్నారు. ఈ కోవలోనే హిట్ 3కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో ఈ ఫ్రాంచైజీ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. హిట్ 1లో విశ్వక్ సేన్, హిట్ 2లో అడవి శేష్ నటించగా మూడో ఫ్రాంఛైజీలో నాని హీరోగా నటించారు. ఈ ఫ్రాంఛైజీలతో శైలేష్ కొలనుకు దర్శకుడిగా మంచి పేరు రావడంతో పాటు హిట్ 3పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.

హిట్ 3లో నాని సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. వాల్‌పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో ప్రశాంతి త్రిపిర్నేని, నానిలు హిట్ 3 చిత్రాన్ని నిర్మించారు. సూర్య శ్రీనివాస్, రావు రమేశ్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్‌లు ఇతర కీలకపాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. సాను జాన్ వర్గీస్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. కార్మికుల దినోత్సవం కానుకగా మే 1న హిట్ 3 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

HIT 3 OTT Release when to expect natural star nani s crime thriller movie to stream online

టీజర్ , ట్రైలర్‌లతో పాటు హిట్ ఫ్రాంఛైజీ మీదున్న క్రేజ్ నేపథ్యంలో హిట్ 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే నాని సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హిట్ 3 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌కు మంచి ధర పలికినట్లుగా ఫిలింనగర్ టాక్. ముందుగా థియేట్రికల్ రన్ విషయానికి వస్తే నైజాం రైట్స్ రూ.13 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ.5.5 కోట్లు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.15 కోట్ల మేర జరిగింది.

ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇతర రెస్టాఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ మొత్తం రూ.5 కోట్ల మేర బిజినెస్ చేసింది. నానికి బలమైన బేస్ ఉన్న ఓవర్సీస్‌లో రూ.10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో నాన్ తెలుగు రీజియన్స్‌లో రూ.15 కోట్ల మేరకు వ్యాపారం జరిగింది. మొత్తంగా హిట్ 3 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.48.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు తెలిపారు. హిట్ 3 సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.50 కోట్ల షేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని విలువ కట్టారు.

ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. ఓటీటీ, ఆడియో, శాటిలైట్ హక్కులు కూడా రూ.72 కోట్లు పలికినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే హిట్ 3కి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు కలిపి ఓవరాల్‌గా రూ.120.5 కోట్ల బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇది నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ అని ఫిలింనగర్ టాక్. మరి నాని ఈ మొత్తాన్ని ఎన్ని రోజుల్లో రికవరీ చేస్తాడోనని ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు.. థియేటర్‌లోకి వచ్చి గంటలు గడవకముందే హిట్ 3 ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆ సెక్షన్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దీని గురించి ఇంటర్నెట్‌ను తెగ జల్లెడ పట్టేస్తున్నారు. హిట్ 3 డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.54 కోట్ల భారీ డీల్‌తో సొంతం చేసుకుందని ఫిలింనగర్ టాక్. థియేటర్‌లో రిలీజైన ఐదు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనే అగ్రిమెంట్ కుదిరింది. దీని ప్రకారం మే చివరి వారం లేదంటే జూన్ మొదటి వారంలో హిట్ 3 ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X