OTTలో భయపెడుతున్న మరో కొత్త దెయ్యం సినిమా... చూడాలంటే కాస్త డేర్ ఉండాల్సిందే!
ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే రెగ్యూలర్ సినిమాల కంటే.. హార్రర్ సినిమాలు అంటే జనాలకు కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక అలాంటి ఓ సినిమానే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇక ఆ సినిమా చూడాలంటే... కాస్త డేర్ ఉండాలి. హాలీవుడ్ లో ప్రేక్షకులను భయపెట్టిన ది నన్ 2 ఇప్పుడు తెలుగు వర్షన్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఆ సినిమా ఏంటి.. దాని కథేంటి.. ఎందులో స్ట్రీమింగ్ అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భాష ఏదైనా... సినిమా బాగుంటే మనోళ్లు పట్టం కడుతారనే విషయం తెలిసిందే. ఇక హాలీవుడ్ సినిమాలను కూడా మనోళ్లు బాగానే చూస్తారు. ఇక అలాంటి ఓ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అది కూడా తెలుగు వర్షన్ లో విడుదల అయి... ప్రేక్షకులను విపరీతంగా భయపెడుతోంది. వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ సంస్థ నుంచి వచ్చిన మూవీస్... దాదాపు అన్ని హార్రర్ మూవీసే.

ఇక వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి ది కంజూరింగ్, అన్నబెల్లె, ఈవిడ్ డెడ్, లైట్స్ అవుట్ వంటి హార్రర్ ఫ్రాంఛైజీ సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాలు హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ బ్యానర్ నుంచి మరో హార్రర్ మూవీ ది నన్. ఈ సినిమా 2018లో థియేటర్లలో ప్రేక్షకులను మాత్రం ఓ రేంజ్ లో భయపెట్టేసింది. అంతే కాదు వసూళ్ల పరంగా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఇక ఐదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ ది నన్ 2 వచ్చింది. జేమ్స్ వాన్, పీటర్ సాఫ్రన్, జూడ్సన్ స్కాట్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మైఖేల్ చేవ్స్ డైరెక్టర్. సిస్టర్ ఇరేనే పాత్రలో టైస్సా ఫార్మిగా చేసింది. సెప్టెంబర్ 8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక బాక్సాఫీస్ వద్ద ది నన్ 2 సినిమా కూడా భారీ వసూళ్లను రాబట్టింది. అంతే కాదు జనాలను భయపెట్టేసింది.

ఇక ది నన్ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమోజాన్ ప్రైమ్ భారీ ధరకు విక్రయించింది. ఇక ఈ సినిమా డిజిటల్ ప్రిమియర్ కు సిద్ధం అయింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ది నన్ 2 స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీ వర్షన్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా ఒక్క అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనే కాకుండా బుక్ మై షోలోనూ స్ట్రీమింగ్ అవుతుంది.
ఒక యువతి దెయ్యంగా మారితే ఎలాంటి పరిస్థితులు వచ్చాయి... అనే కథాశంతంతో ఈ సినిమాను తెరకెక్కించారు. కథ, కథనం, స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రెంటల్ విధానంలోనే అందుబాటులో ఉంది. త్వరలోనే తమ సబ్ స్క్రైబర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. మరి థియేటర్లలో ది నన్ 2 సినిమాను మిస్ అయితే కనుక.. ఓటీటీలో చూసేయండి. కానీ కాస్త డేర్ ఉండాల్సిందే సుమి.


Click it and Unblock the Notifications











