OTTలోకి రూ.2 వేల కోట్ల రీసెంట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ.. ఎప్పుడు, ఎందులో చూడాలంటే?
ఓటీటీలోకి ప్రతి వారం కొత్త సినిమాలు, సిరీసులు వస్తూనే ఉంటాయి. అయితే అందులో థ్రిల్లర్, అడ్వంచర్ సినిమాలు అంటే ప్రేక్షకులకు ఇంకాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. అయితే మరో హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రాంజైజీ ఇండియానా జోన్స్. ఇక ఇటీవల ఇండియానా జోన్స్ 5 ప్రేక్షకుల ముందుకు వచ్చి 2వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఆ వివరాలు...
హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచరస్ మూవీస్ అనగానే మనకు గుర్తుకు వచ్చే సినిమా ఇండియానా జోన్స్. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ఐదు సినిమాలు రాగా అన్ని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచాయి. ఇక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. మొదటి భాగం 1981లో ఇండియానా జోన్స్ అండ్ రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ పేరుతో బాక్సాఫీస్ వద్దకు వచ్చింది. సూపర్ హిట్టుగా నిలిచి కాసుల వర్షం కురిపించింది.

ఆ తర్వాత 1984 లో ఇండియానా జోన్స్ అండ్ టెంపుల్ ఆఫ్ డూమ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆ తర్వాత 1989లో లాస్ట్ క్రూసేడ్ పేరుతో రాగా ఇది కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత 2008లో కింగ్‌డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్ చిత్రం బాక్సాఫీస్ వద్దకు రాగా ఇది కూడా కాసుల వర్షం కురిపించింది. ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించి రికార్డులు కొల్లగొట్టాయి.
ఈ సినిమాలకు దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వం వహిం చాడు. ఇక ఈ నాలుగు సినిమాలు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను అందుకోవడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వేల కోట్లలో వసూళ్లు రాబట్టాయి. ఈ సిరీస్ మూవీస్ లో హీరోగా ఇండియానా జోన్స్‌గా హారిసన్ ఫోర్డ్ నటించాడు. నిధిని కాపాడే వ్యక్తిగా జోన్స్ చేసే విన్యాసాలు, అడ్వెంచర్లు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఇక హాలీవుడ్ ఆల్ టైం బాక్సాఫీస్ మూవీస్‌లో ఇండియానా జోన్స్ చిత్రాలు టాప్ 10 లో ఉంటాయనడంలో సందేహం లేదు.

ఇదిలా ఉంటే.. ఈ ఫ్రాంచైజీ నుంచి సుమారు 42 ఏళ్ల తర్వాత 2023లో వచ్చిన ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నాలుగు సినిమాలకు స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఐదో చిత్రానికి మాత్రం జేమ్స్ మాన్ గోల్డ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూన్ 29న థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.2వేల కోట్ల రూపాయలు వసూలు చేసిందని తెలుస్తోంది. ఇండియానా జోన్స్ గా హారిసన్ ఫోర్డ్ నటించారు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. డిసెంబర్ 01 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా రెంటల్ గా అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీలో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ తీసుకుంది.


Click it and Unblock the Notifications











