Avatar 2: ఓటీటీలోకి విజువల్ వండర్... ఈసారి ఫ్రీగా కాదు.. ఎంత చెల్లించాలంటే?
హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సిల్వర్ స్క్రీన్ విజువల్ వండర్ ప్రాజెక్ట్ అవతార్ అని తెలిసిందే. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. అయితే ఇదే ప్రాంఛైజీలో గతేడాది అవతార్ 2 ప్రేక్షకుల ముందుకొచ్చి... బాక్సాఫీస్ వద్ద మరోసారి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
కాగా ఈ ఎక్జయిటింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంలో సందడి చేసేందుకు సిద్ధం అయింది. మీరు ఇంట్లో ఉన్నపుడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పండోరాకు తిరిగివెళ్లండి. అవతార్ 2 డిజిటల్ ప్రపంచంలోకి మార్చి 28న రాబోతుంది. మునుపెన్నడూ చూడనట్వంటి సినిమాను మూడు గంటలు యాక్సెస్ చేసేందుకు అవతార్ 2 ను మీ సినిమా కలెక్షన్లలో యాడ్ చేసుకోండి.. అంటూ ట్వీట్ ద్వారా అవతార్ యూనిట్ తెలియజేసింది.

ఇక ఈ సినిమా మూవీఎస్ ఎనీ వేర్, యాపిల్ టీవీ, ప్రైమ్ వీడియో, వుడు, ఎక్స్‌ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్ మూవీ అండ్ టీవీల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా చూడాలనుకున్న వారు ముందస్తుగా ఆర్డర్ చేసుకోవచ్చు. 4కే అల్ట్రా హెచ్‌డీటీఎం రెజల్యూషన్, డాల్బీ అట్మాస్ సౌండ్ ట్రాక్ తో అవతార్ 2 డిజిటల్ వరల్డ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక అవతార్ 2 ను చూడాలంటే 19.99 అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాలి. అంటే మన కరెన్సీలో సుమారు 1600 రూపాయలు.
ఒకసారి మూవీని ప్రీ ఆర్డర్ చేసిన తర్వాత 48 గంటల్లోగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే సినిమా చూడడం, డౌన్‌లోడ్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయడం కుదరదు. అవతార్ 2లో సామ్ వార్తింగ్టన్, జో సల్దానా, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్ లాంటి అగ్రతారలు నటించారు. ఒక ఇండియాలోనే ఆరు భాషల్లో అంటే.. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైంది. భారత్ లో 473 కోట్లకుపైగా గ్రాస్, 391 కోట్ల షేర్ నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











