Avatar The Way Of Water: ఓటీటీ విడుదలకు సిద్ధమైన బిగ్ మూవీ అవతార్ 2.. డేట్ ఫిక్స్!
అంతర్జాతీయ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ 2 గురించి అందరికీ తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల తర్వాత అవతార్ సినిమాకు సీక్వెల్ గా "అవతార్ ది వే ఆఫ్ వాటర్" చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా గతేడాది డిసెంబర్ లో విడుదల అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి రికార్డులు సృష్టించింది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ వేధికగా ఎప్పుడు విడుదల చేస్తారా అని చాలా రోజులుగా అభిమానులు వేచి చూస్తున్నారు.
అయితే మార్చి 28వ తేదీ నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. యాపిల్ టీవీ, ప్రైమ్ వీడియో, వుడు, గూగుల్ ప్లే, ఎక్స్ ఫినిటీ, ఏఎంసీ అండ్ మైక్రోసాఫ్ట్ ఫ్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇది పేయిడ్ మోడ్ లో అందుబాటులో ఉంది. రెంటల్ ధర 19.9 డాలర్లు (1639 రూపాయలు)గా ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమాను రెంట్ ప్రాతిపదికన పలు డిజిటల్ పలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో ఈ సినిమా సందడి చేస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాను ఎలాంటి అద్దెలు లేకుండా నేరుగా ఓటీటీలో వీక్షించవచ్చు. అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమాను జూన్ 2వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుందని మేకర్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ చిత్రాన్ని ఎన్ని భాషల్లో విడుదల చేస్తున్నారనే విషయాన్ని మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించలేదు.
అవతార్ 2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2.9 బిలియన్ల డాలర్ల వసూళ్లను రాబట్టిది. హాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం రూ.60.74 కోట్ల షేర్ వసూలు చేసింది. కేవలం 5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. రూ.5.25 కోట్ల టార్గెట్ తో చిత్రం బరిలోకి దిగింది.
అవతార్ మొదటి భాగంలో పండోరా గ్రహం, అడవులు, పక్షులు, జంతువులతో ఓ కొత్త లోకాన్ని సృష్టించిన కామెరూన్.. అవతార్ -లో జలచరాలతో మెస్మరైజ్ చేశాడు. సముద్ర అడుగు భాగంలో జరిగే సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. క్వారిచ్ నుంచి తప్పించుకోవడానికి జేక్, నేట్రి ఎలాంటి పోరాటం సాగించారన్నది గ్రాఫిక్స్ ద్వారా జేమ్స్ కామెరూన్ అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. అవతార్ 3 కూడా రాబోతున్నట్లు దాన్ని 2024లో విడుదల చేయబోతున్నట్లు కామెరూన్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











